Homeటాప్ స్టోరీస్రాజు గారు వద్దు అన్నా కూడా వినలేదు అంటా...సినిమా ఫలితం మిశ్రమం గానే ఉంది

రాజు గారు వద్దు అన్నా కూడా వినలేదు అంటా…సినిమా ఫలితం మిశ్రమం గానే ఉంది

Evvariki Cheppoddu Movie Talk
Evvariki Cheppoddu Movie Talk

ఆ కొత్త హీరో సినిమా హిట్ అయ్యింది కాబట్టి అలాంటి నేపధ్యం ఉన్న సినిమాలు బాగా ఆడుతున్నాయి అని చెప్పి అదే కోవకి చెందిన సినిమా తీసి జనాల మీదికి వదిలితే జనాలు ఆ సినిమాకి, ఈ సినిమాకి తేడా గురించి బాగా ఆలోచిస్తారు అనే సంగతి కొంతమంది దర్శకులు, హీరోలు, నిర్మాతలు మర్చిపోయి సినిమా విడుదల చేస్తే ఆ పరిస్థితి ఎలా ఉంటుందంటే…..

సరిగ్గా ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ సినిమాలాగే ఉంటుంది. కథా నాయకుడు రాకేష్ వర్రే మొదటగా ఈ సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు అని చాలా మంది అన్నారు. సినిమా మొదటి రోజు కూడా మంచి టాక్ ని సొంతం చేసుకుంది కానీ ఒక్క రోజు చేసిన పబ్లిసిటిని రోజు నమ్మలేరు జనాలు. అవును నిజమే…ఈ సినిమా విషయంలో చేసిన పబ్లిసిటి కేవలం డబ్బులు ఇచ్చి తెప్పించుకున్న పబ్లిసిటి అని సినిమాని నిజంగా చూసి బయటికి వచ్చిన జనాలు చెప్పారు.

- Advertisement -

ఇక మూవీ ప్రమోషన్స్ కోసం హీరో, హీరోయిన్స్ కూడా తమ సినిమా హిట్ అని భ్రమలో ఉన్నారు అని ఇటీవలే జరిగిన ఇంటర్వూస్ ని బట్టి  తెలిసిపోతుంది. వారం ముందు లేదా 10 రోజుల ముందు సినిమా విడుదల అవుతుంది అంటే సినిమా ప్రమోషన్స్ మీద పిచ్చి అందరికి ఉంటుంది. అప్పటికి రాకేష్ వర్రే జోష్, బద్రీనాథ్, మిర్చి, బాహుబలి: ది బిగినింగ్ సినిమాలలో బాగా గుర్తింపు ఉన్న పాత్రలో చేసాడు. అందువలన తనకి కొంతమంది దర్శకులని, హీరోలని, నిర్మాతలని పరిచయంలో పెట్టుకున్నాడు. వారితోనే సినిమా గురించి పాజిటివ్ గా ప్రమోషన్స్ చేపించేసారు.

సినిమా పాటల దగ్గరనుండి ట్రైలర్ వరకు కొంతమందిని మాత్రమే ఆకట్టుకుందని తెలిసి ఇక ఎలా అయినా సినిమా జనాల మీదికి వెళ్లి అందరు సినిమాని చూడాలని చెప్పి కొంతమంది పెద్ద దర్శకులని ప్రమోషన్స్ కి దింపారు రాకేష్ వర్రే. ఇక తను కూడా ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ మా సినిమా చిరంజీవి గారి ‘సైరా’ మూవీకి పోటీగా విడుదల అయ్యినా కూడా మంచి కలెక్షన్లు రాబడుతుంది అని, నేను మొన్న ఒక థియేటర్ కి వెళ్తే 1000 మంది ఉండే ఆ థియేటర్ లో దాదాపు 800 మంది జనాలు ఉన్నారు అని అన్నారు.

ఇక అసలు విషయం చెపుతూ మొదట కథ విన్న వెంటనే నేనే నిర్మాతగా ఉండాలి అనుకున్నాను. సహాయం విషయంలో దిల్ రాజు గారిని కలిస్తే నువ్వు నిర్మాతగా ఉండకు…నువ్వే హీరో, నిర్మాత అంటే బాధ్యతలు సరిగ్గా చేయలేవు అని నాకు సలహా ఇచ్చి వద్దు అన్నా వినకుండా ‘దిల్ రాజు’ గారు తమ సినిమాకి ఒక మంచి పంపిణి దారుడుగా ఉంటూ సినిమా విజయంలో మాకు తోడు అయ్యారు అని దిల్ రాజు గారి మీద ఉన్నఅభిమానాన్ని మీడియా వారి ముందు వివరించారు.

అలా వద్దు అన్నా వినకుండా పంపిని చేసిన సినిమా ఇప్పుడు అటు ఇటు కాకుండా థియేటర్ లో ఆడుతుంది అని సినిమా చుసిన జనాలు అనుకుంటున్నారు. సినిమాకి మిశ్రమ ఫలితాలు రావటం వారి యాక్టింగ్ కూడా అంతగా జనాలకి నచ్చలేదు అని అనుకుంటున్నారు. చూద్దాం మరి ఇన్ని అడ్డంకుల మధ్య సినిమా ఎలా ఆడుతుందో?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All