
ఆకాశమే నీ హద్దురా , జై భీమ్ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న సూర్య..రీసెంట్ గా ఈటీ మూవీ తో మార్చి 10 న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డిఫరెంట్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పాండురాజ్ డైరెక్ట్ చేయగా.. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ హిందీ కన్నడ మలయాళ భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేసారు. తెలుగులో ”ఈటీ” (ఎవరికీ తలవంచడు) పేరుతో రిలీజ్ అయ్యింది. కాకపోతే సినిమా ప్రేక్షకులను అలరించడంలో విఫలమైంది.
లాయర్ పాత్రలో సూర్య తన నటనతో అదరగొట్టినప్పటికీ, సినిమా పరమ రొటీన్ గా ఉందని మూవీ లవర్స్ పెదవి విరిచారు. పైగా విడుదలకు ముందు సినిమాను సరిగ్గా ప్రమోట్ చేయకపోవడం మార్చి 11న ప్రభాస్ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘రాధేశ్యామ్’ రిలీజ్ కావడంతో బాక్సాఫీస్ వద్ద ఈటీ సక్సెస్ కాలేకపోయింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటిటి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. సన్ నెక్స్ట్ లో ఏప్రిల్ 7 నుండి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు అధికారిక ప్రకటన చేసారు. మరి థియేటర్స్ లలో పెద్దగా సందడి చేయలేకపోయినా ఈ మూవీ ఓటిటి లో ఎలా అలరిస్తుందో చూడాలి. ప్రస్తుతం సూర్య బాల డైరెక్షన్లో ఓ మూవీ చేయబోతున్నాడు. ఇందులో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.