
ఆకాశమే నీ హద్దురా , జై భీమ్ చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్న సూర్య నటించిన తాజా చిత్రం ‘ఈటీ – ఎవరికీ తలవంచకు’. పాండిరాజ్ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ మూవీలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటించింది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
ఈ చిత్రానికి ఇమ్మాన్ సంగీతం అందించగా..గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ప్రేక్షకులను ఆకట్టుకోవడం లో విఫలమైంది. దీనికి తోడు నెక్స్ట్ డే రాధే శ్యామ్ విడుదల కావడం తో తెలుగు లో ఈటీ ని పట్టించుకునే వారు లేకుండా పోయారు. దీంతో కలెక్షన్లు లేకుండా అయ్యింది.
ఫస్ట్ వీక్ కు గాను కలెక్షన్స్ చూస్తే..
నైజాంలో రూ. 87 లక్షలు
సీడెడ్‌లో రూ. 46 లక్షలు
ఉత్తరాంధ్రలో రూ. 43 లక్షలు
ఈస్ట్‌లో రూ. 26 లక్షలు
వెస్ట్‌లో రూ. 18 లక్షలు
గుంటూరులో రూ. 23 లక్షలు
కృష్ణాలో రూ. 21 లక్షలు
నెల్లూరులో రూ. 14 లక్షలతో కలిపి.. రూ. 2.78 కోట్లు షేర్, రూ. 5.25 కోట్లు గ్రాస్ మాత్రమే వచ్చింది.