
జూనియర్ ఎన్టీఆర్ అమెరికా భామ ”ఎమ్మా రాబర్ట్స్ ”తో రొమాన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది . తాజాగా ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నటిస్తున్న విషయం విదితమే . కాగా ఆ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్నాడు కాగా ఎన్టీఆర్ సరసన బ్రిటిష్ భామ డైసీ ఎడ్గర్ జోన్స్ ని ఎంపిక చేసారు అయితే షూటింగ్ సమయానికి హ్యాండ్ ఇచ్చేసింది దాంతో అప్పటి నుండి హీరోయిన్ ల వేటలో పడుతూనే ఉన్నాడు దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి .
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ సరసన ” ఎమ్మా రాబర్ట్స్ ” ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది . నటి , సింగర్ కూడా అయిన ఈ భామ ఎన్టీఆర్ కు చక్కని జోడీ అనిపించుకుంటుందనడంలో సందేహం లేదు . ఇటీవలే రాజమౌళి అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే . కాగా ఇదే పని మీద వెళ్లినట్లుగా తెలుస్తోంది . అయితే ఈ భామని ఎంపిక చేసిన విషయం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది . చరణ్ సరసన బాలీవుడ్ భామ అలియా భట్ ని ఎంపిక చేసిన విషయం తెలిసిందే .