Homeటాప్ స్టోరీస్వేణుమాధవ్ నామినేషన్ తిరస్కరణ

వేణుమాధవ్ నామినేషన్ తిరస్కరణ

Election commission rejected venumadhav nominationహాస్యనటుడు వేణుమాధవ్ కోదాడ లో నామినేషన్ వేసాడు , అయితే వేణుమాధవ్ వేసిన నామినేషన్ సరైన పద్దతిలో లేకపోవడంతో అతడి నామినేషన్ ని ఎన్నికల అధికారులు తిరస్కరించారు . నామినేషన్ వేసిన మరుసటి రోజే నామినేషన్ ని రిజెక్ట్ చేయడంతో షాక్ తిన్నాడు ఈ కమెడియన్ . టాలీవుడ్ లో వందలాది చిత్రాల్లో హాస్య నటుడిగా నటించిన వేణు మాధవ్ సత్తా చాటాడు . ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన వేణుమాధవ్ మిమిక్రీ ఆర్టిస్ట్ . సినిమాల్లోకి రాకముందు మిమిక్రీ చేసుకుంటూ జనాలను నవ్వించేవాడు . ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కోసం మిమిక్రీ ఆర్టిస్ట్ గా సేవలందించాడు . ఆమధ్య ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఉప ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం తరుపున ప్రచారం కూడా చేసాడు వేణుమాధవ్ .

అయితే కోదాడ టీడీపీ టికెట్ ఆశించాడు కానీ ఆ టికెట్ దక్కలేదు దాంతో ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసాడు . అయితే నామినేషన్ లో పొందు పరచాల్సిన విషయాలు సరిగ్గా లేకపోవడంతో ఎన్నికల అధికారులు వేణుమాధవ్ నామినేషన్ ని రిజెక్ట్ చేసారు . ఎన్నికల అధికారులు రిజెక్ట్ చేయడంతో షాక్ అయినా మళ్ళీ నామినేషన్ వేస్తానని అంటున్నాడు వేణుమాధవ్ .

- Advertisement -

English Title: Election commission rejected venumadhav nomination

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All