Homeటాప్ స్టోరీస్బిగ్ బాస్ 5: కూల్ కోల్పోయిన లోబో, ఇరిటేట్ చేసిన నటరాజ్

బిగ్ బాస్ 5: కూల్ కోల్పోయిన లోబో, ఇరిటేట్ చేసిన నటరాజ్

eight contestants in nominations this week
eight contestants in nominations this week

బిగ్ బాస్ సీజన్ 5లో నిన్న నాలుగో వారానికి సంబంధించి నామినేషన్స్ ప్రక్రియ పూర్తయింది. మొదటి మూడు వారాల లాగానే ఈ ఎపిసోడ్ కూడా వాడివేడి చర్చతో సాగింది. ముందుగా లోబో ప్రియా మీద గట్టి గట్టిగా అరుచుకుంటూ ముందుకు వెళ్లడం చూడటానికి అంత బాగా అనిపించలేదు. తన ప్రేమకథను కించపరిచింది అన్నది లోబో వాదన. ఆ విషయంలో హర్ట్ అవ్వడంతో అలా అరిచేసాడు అనుకుందామనుకున్నా అది సభ్యతగా అనిపించలేదు. అక్కడ ప్రియా కూడా అరిచి ఉంటే సిట్యుయేషన్ మరింత దిగజారేది. కానీ ఆమె తన కూల్ ను కోల్పోలేదు. తన ప్రవర్తనతో లోబో మరిన్ని నామినేషన్స్ కు గురి కావాల్సి వచ్చింది.

ఎప్పటిలానే నటరాజ్ మాస్టర్ కంటెస్టెంట్స్ ను ఇరిటేట్ చేసాడు. తనకే అన్నీ తెలుసు అన్నట్లు, తన క్యారెక్టర్ ఎనాలిసిస్ లతో నటరాజ్ మాస్టర్ ప్రవర్తన మరోసారి కంటెస్టెంట్స్ లో నెగటివిటీ పెంచింది. మొదటినుండీ గుంటనక్క అంటూ డ్రామా క్రియేట్ చేసిన ఆయన ఈసారి విశ్వతో వాదనకు దిగి సినిమా డైలాగ్స్ కొట్టి, చేతులతో వింత వింతగా ప్రవర్తించాడు. ఆయన డెలివరీ సమయంలో ఉన్న తన భార్యను మిస్ అవుతున్న ఫీలింగ్ కనిపిస్తోంది. మొత్తానికి ఈ వారం ఎలిమినేషన్ కోసం లోబో, నటరాజ్, రవి, ప్రియా, కాజల్, సిరి, సన్నీ, అన్నీ లు నామినేట్ అయ్యారు. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All