
కరోనా ఏమో గానీ ఈ మధ్య సెలబ్రిటీల ట్విట్టర్ అకౌంట్‌లు హ్యాకింగ్‌కి గురవుతున్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు నుంచి సినీ తారల వరకు హ్యాకర్స్ బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల అనుపమా పరమేశ్వరన్‌తో పాటు చాలా మంది సెలబ్రిటీల ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్‌కి గురి కావడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా వుంటే తాజాగా మరో నటి ట్విట్టర్ అకౌంట్ హ్యాకర్స్ చేతికి చిక్కడం ఆసక్తికరంగా మారింది.
యంగ్ హీరోయిన్ ఈషా రెబ్బా అఫీషియల్ ట్విట్టర్ హాండిల్ సోమవారం హ్యాకింగ్‌కి గురైంది. కొంత మంది హ్యాకర్స్ ఆమె అకౌంట్‌ని తమ స్వాదీనంలోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని వెంటనే పసిగట్టిన ఈషా రెబ్బా వెంటనే ఆ విషయాన్ని ట్విట్టర్ అఫీషయిల్ టీమ్‌కి వెల్లడించిందని తెలిసింది. ప్రసుత్తం ఆమె అకౌంట్‌ని తిరిగి ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.
గత కొంత కాలంగా ఈషా రెబ్బా ట్విట్టర్‌లో యమ యాక్టీవ్‌గా వుంటోంది. స్పెషల్ ఫొటోషూట్‌లకు సంబంధించిన ఫొటోస్‌ని షేర్ చేస్తూ నిత్యం అభివమానులతో టచ్‌లో వుంటోంది. ప్రస్తుతం ఈషా రెబ్బా `లస్ట్ స్టోరీస్` తెలుగు రీమేక్‌లో నటించిన విషయం తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ త్వరలోనే నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.