Homeటాప్ స్టోరీస్రాధే శ్యామ్ నుండి రొమాంటిక్ వీడియో సాంగ్ రిలీజ్

రాధే శ్యామ్ నుండి రొమాంటిక్ వీడియో సాంగ్ రిలీజ్

Ee Raathale Video Song

వరుస పాన్ మూవీస్ తో అలరిస్తున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్..ప్రస్తుతం రాధే శ్యామ్ మూవీ తో మార్చి 11 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ని యూవీ క్రియేషన్స్, టీ సిరిస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. రెబల్ స్టార్ కృష్ణంరాజు పరమహంస అనే ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్నారు.

ఈరోజు శుక్రవారం ఈ మూవీ నుండి ఈ రాతలే వీడియో సాంగ్ విడుదలైంది. ఈ మధ్యే విడుదలైన లిరికల్ సాంగ్‌కు మంచి స్పందన రాగా..ఇప్పుడు ఈ పాటకు సంబంధించిన వీడియో విడుదల చేసారు మేకర్స్. ఈ పాటకి కృష్ణకాంత్ సాహిత్యం అందించగా.. యువన్ శంకర్ రాజా సంగీతంలో హరిణి ఇవటూరి ఆలపించింది. ఈ పాటలోని ప్రతీ ఫేమ్ ఓ దృశ్యకావ్యంగా కనిపిస్తోంది. దీనికి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఇందులో పూజా హెగ్డే ముగ్ధమనోహరంగా కనిపిస్తోందని ప్రశంసలు వస్తున్నాయి. విక్రమాదిత్యగా ప్రభాస్, ప్రేరణగా పూజా హెగ్డే ఆన్ స్ర్కీన్ కెమిస్ట్రీ సినిమాకే హైలైట్ కానుంది. హాలీవుడ్ ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోని విజువల్స్ తో అభిమానులకు ఈ సినిమా ఒక ఐఫీస్ట్ అని అంటున్నారు. మరి పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ , హిందీ భాషల్లో విడుదల కానున్నఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

- Advertisement -

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All