Homeటాప్ స్టోరీస్ఈ నగరానికి ఏమైంది కలెక్షన్లు పడిపోయాయి

ఈ నగరానికి ఏమైంది కలెక్షన్లు పడిపోయాయి

ee nagaraniki emaindi collections droppedపెళ్లి చూపులు వంటి సంచలనాత్మక చిత్రానికి దర్శకత్వం వహించిన తరుణ్ భాస్కర్ దాస్యం రెండో చిత్రం కావడంతో ఈ నగరానికి ఏమైంది పై అంచనాలు ఏర్పడ్డాయి అయితే ఆ అంచనాలు అన్ని తల్లకిందులు చేస్తూ మిశ్రమ ఫలితాన్ని పొందింది ఈ నగరానికి ఏమైంది చిత్రం . భారీ అంచనాలు ఉండటంతో మొదటి రోజున మంచి వసూళ్లు వచ్చాయి , అయితే ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రం కాకపోవడంతో కేవలం మల్టీప్లెక్స్ లోనే ఆదరణ లభిస్తోంది , ఇక బిసి కేంద్రాల్లో అయితే ఈ సినిమాని పట్టించుకున్న వాళ్లే లేకుండాపోయారు దాంతో భారీగా కలెక్షన్లు పడిపోయాయి .

సినిమాపై నెగెటివ్ ప్రచారం కూడా కలెక్షన్లు పడిపోవడానికి కారణం అయ్యింది . ఏ సెంటర్ లలో మాత్రం ఈ సినిమాకి ఆదరణ లభిస్తుండగా బిసి కేంద్రాల్లో మాత్రం థియేటర్ లన్ని వెలవెలబోతున్నాయి . ఇక ఈ సినిమాపై నెగెటివ్ ప్రచారం కు తోడు రివ్యూస్ కూడా మిక్స్డ్ గా వచ్చాయి కొంతమంది తరుణ్ భాస్కర్ ని హర్ట్ చేయడంతో ఎక్కడో కాలింది దాంతో విమర్శకులపై విరుచుకు పడుతున్నాడు తరుణ్ భాస్కర్ . మొత్తానికి ఈరోజు నుండి ఈ నగరానికి ఏమైంది చిత్రానికి అసలు పరీక్ష మొదలు కానుంది .

- Advertisement -

English Title: ee nagaraniki emaindi collections dropped

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All