
నటీనటులు: పవన్‌తేజ్, మేఘన, పృథ్వీ, రఘుబాబు, నవీన్, అభయ్ సింగ్, నోయెల్ తదితరులు నటించారు.
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అభిరామ్. ఎమ్
నిర్మాత: రాజేష్ నాయుడు
ఫొటోగ్రఫీ: సునీల్‌కుమార్. ఎన్
సంగీతం: కార్తీక్ కొడకండ్ల
ఎడిటింగ్: శ్రీకాంత్ పట్నాయక్, ఆర్. తిరు
డైలాగ్స్ అండ్ అడీషనల్ స్క్రీన్‌ప్లే : తాజుద్దీన్ సయ్యద్
రిలీజ్ డేట్ : 26 -03-21
రేటింగ్: 2.75/5
కొత్త దనానికి తెలుగు ప్రేక్షకులు పట్టం కడుతున్న విషయం తెలిసిందే. కథ కొత్తగా వుంటే అందులో నటించే నటీనటుల చగురించి పట్టించుకోవడం లేదు. అయితే కొత్త కథ, దానికి తోడు మెగా ఫ్యామిలీకి చెందిన వ్యక్తి హీరో అయితే దానికి ప్రేక్షకులు ఏ స్థాయిలో బ్రహ్మరథం పడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రచార చిత్రాల నుంచే ఆకట్టుకున్న `ఈ కథలో పాత్రలు కల్పితం` మూవీ ద్వారా కొణిదెల ఫ్యామిలీకి చెందిన పవన్‌తేజ్ హీరోగా పరిచయం అయ్యారు. కొత్త తరహా కథతో రూపొందిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకుందా? హీరోగా పవన్ తేజ్ చేసిన తొలి ప్రయత్నం ఫలించిందా అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ:
కృష్ణ (పవన్ తేజ్) హీరోగా ప్రయత్నాలు చేస్తుంటాడు. అతనికి ఓ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న శృతి (మేఘన కుమార్)తో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. వీరి ప్రేమాయణం సాఫీగా సాగుతున్న క్రమంలో కృష్ణకు ఓ సినిమాలో హీరోగా అవకాశం వస్తుంది. ఆ మూవీని ఓ పాపులర్ మోడల్ యదార్థ కథ నేపథ్యంలో రూపొందిస్తుంటారు. ఇంతకీ ఆ మెడల్ ఎవరు? ఆమె వెనకున్న కథేంటీ?. `పెళ్లి` ఫేమ్ పృథ్వీ ఏసీపీ పాత్రలో ఆమె కోసం ఎందుకు అన్వేషిస్తున్నారు?.. హీరో కావాలనుకున్న కృష్ణకు కనిపించకుండా పోయిన మోడల్‌కున్న సంబంధం ఏంటీ? అన్నది తెరపైన చూడాల్సిందే.
నటీనటుల నటన:
ఈ సినిమా విషయంలో ముందుగా చెప్పుకోవాల్సిన వ్యక్తి హీరో పవన్‌తేజ్. మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా తెరంగేట్రం చేసిన ఈ హీరో తొలి చిత్రంలోనే మంచి ఈజ్‌తో తనదైన స్టైల్ నటనతో ఆకట్టుకున్నాడు. బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్ పలికిన తీరు బాగుంది. డ్యాన్స్, ఫైట్స్‌లలో తన మార్కుని చూపించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ మేఘన గ్లామర్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది. ఆ తరువాత చెప్పుకోవాల్సింది `పెళ్లి` ఫేమ్ పృథ్వీ. ఏసీపీ పాత్రలో తనదైన నటనని ప్రదర్శించి ఆకట్టుకున్నారు. రియల్ రత్నం పాత్రలో రఘుబాబు నవ్వించారు. సింగర్ నోయెల్ విలన్‌గా అలరించారు. మిగతా పాత్రల్లో నటించిన వాళ్లు తమ పాత్రల పరిధిమేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
సాంకేతిక నిపుణులు:
థ్రిల్లర్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి సునీల్‌కుమార్ అందించిన ఫొటోగ్రఫీ బాగుంది. ప్రధాన సన్నివేశాల్లో సునీల్‌కుమార్ అందించిన కెమెరా పనితనం బాగుంది. ఇక కార్తీక్ కొడకండ్ల పాటలు, నేపథ్య సంగీతంలో సినిమాకు మరింత ప్లాస్ అయ్యారు. థ్రిల్లర్ కథకు తగ్గ నేపథ్య సంగీతాన్ని అందించి కార్తీక్ ఆకట్టుకున్నారు. శ్రీకాంత్ పట్నాయక్, ఆర్. తిరుల ఎడిటింగ్ బాగుంది.
ది గ్రేట్ సినిమాటోగ్రాఫర్ ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కు తనదైన శైలితో రంగులద్దారు. పాటల్లో ఆయన చేసిన మ్యాజిక్ ఆకట్టుకుంటుంది. ఒక విధంగా ఈచిత్రానికి ఆయన ఫొటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేవి శ్రీప్రసాద్ `ఉప్పెన`తో మళ్లీ చెలరేగిపోతున్నాడు. అదే ఊపుని ఈ చిత్రానికీ కొనసాగించాడు. పాటలు, నేపథ్య సంగీతంతో ఆకట్టుకున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. సున్నితమైన కథని ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా వెంకీ అట్లూరి తెరకెక్కించిన తీరు బాగుంది. తాజుద్దీన్ సయ్యద్ అందించిన
డైలాగ్స్ అండ్ అడీషనల్ స్క్రీన్‌ప్లే మరింత బలాన్ని చేకూర్చాయి. దర్శకుడి టేకింగ్ బాగుంది.
తీర్పు:
సస్పెన్స్ థ్రిల్లర్ కథని ఆద్యంతం వినోదాత్మకంగా నడిపించిన తీరు బాగుంది. కథని అనేక మలుపులతో నడిపించిన తీరు ఆసక్తిని రేకెత్తించేలా వుంది. తను ఎంచుకున్న కథని అనుకున్న పంథాలో డీల్ చేయడంలో దర్శకుడు అభిరామ్ సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. పవన్‌తేజ్, పృథ్వీల నటన మేఘన గ్లామర్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కొత్తదాన్ని కోరుకునే ప్రేక్షకులని మెప్పించే చిత్రమిది.