Homeటాప్ స్టోరీస్ఏదైనా జరగొచ్చు ఫస్ట్ లుక్ లాంచ్...

ఏదైనా జరగొచ్చు ఫస్ట్ లుక్ లాంచ్…

వెట్ బ్రెయిన్ ఎంటర్టైన్మెంట్ మరియు సుదర్మ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “ఏదైనా జరగొచ్చు”. రమాకాంత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శివాజీ రాజా తనయుడు విజయ్ రాజా హీరోగా వెండితెరకు పరిచయమవుతున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ విలక్షణ నటుడు తమిళ స్టార్ బాబిసింహా విలన్ గా నటిస్తున్నారు. వీరితో పాటు చాలామంది ప్రముఖ నటులకు శిక్షణ అందించిన వైజాగ్ సత్యానంద్ కుమారుడు రాఘవ, ప్రముఖ దర్శకుడు విజయ్ భాస్కర్ గారు అల్లుడు రవిశివతేజ లు హీరో స్నేహితులు గా నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను సీనియర్ పాత్రికేయులు వినాయకరావు, డిజిటల్ పోస్టర్ ను సీనియర్ పాత్రికేయులు పసుపులేటి రామారావు ఆవిష్కరించారు. ఈ సంధర్భంగా రామానాయుడు స్టూడియోలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో…
వినాయక్ రావు మాట్లాడుతూ… హీరో గా పరిచయం అవుతున్న నా స్నేహితుడు శివాజీరాజా కుమారుడు మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. కవరేజ్ కోసం వచ్చిన నన్ను చీఫ్ గెస్ట్ చేసి ఏదైనా జరగొచ్చు అనిపించారు. తన తండ్రి శివాజీరాజా లాగా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను అన్నారు.
పసుపులేటి రామారావు మాట్లాడుతూ… మా అందాల రాజు విజయ్ రాజు అన్న విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ ప్రకాష్ మాట్లాడుతూ… కట్ట రమాకాంత్ గారు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఉగాది సందర్భంగా లాంచ్ చేసాం. ఈ టీమ్ అందరికి మా కృతజ్ఞతలు అని అన్నారు.
ప్రొడ్యూసర్ ఉమాకాంత్ మాట్లాడుతూ… మా సినిమా ని అందరూ చూసి తప్పకుండా ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు.
దర్శకుడు రమాకాంత్ మాట్లాడుతూ… ముఖ్యంగా నేను శివాజి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు నన్ను నమ్మి ఆయన వాళ్ల అబ్బాయిని నాకు అప్పగించినందుకు థాంక్స్. ప్రొడ్యూసర్ గారికి కూడా కృతజ్ఞతలు ఈ సినిమా కి రైట్ హాండ్ సినిమాటోగ్రఫీ అని చెప్పాలి. విసువల్ ఎఫెక్ట్స్ చాలా బాగా వచ్చాయి. కచ్చితంగా మీకు ఈ చిత్రం నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరపుకుంటోంది.ఈ సినిమాను సమ్మర్ కానుకగా మే లో విడుదల చేయబోతున్నాం అన్నారు.
సురేశ్ కొండేటి మాట్లాడుతూ… ఈ సినిమానే కాదు ఏ సినిమా కైనా నా అన్నయ్య తనయుడు విజయ్ కి మంచి విజయం సాదించాలని కోరుకుంటున్నాను అన్నారు. కథే మంచి హీరో మంచి కంటెంట్ తో రమాకాంత్ గారిని నమ్మి సినిమా చేశారు అన్నారు.
హీరో విజయ్ మాట్లాడుతూ… నా ఈ అవకాశం కల్పించిన రమాకాంత్ గారికి నా కృతజ్ఞతలు. రవి చెప్పినట్లు రమాకాంత్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కెమెరామెన్ సమీర్ రెడ్డి గారు అధ్బుతమైన విజువల్స్ ఇచ్చారు. ఈ సినిమాకి ఆయన చాలా లైఫ్ ఇచ్చారు. ప్రొడ్యూసర్ చాలా ఖర్చుపెట్టారు.ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. అన్నిటికంటే ముందు నన్ను ప్రోత్సహించిన నా పేరెంట్స్ కి థాంక్స్. మా నాన్నగారికి చెప్పాను నేను ఆయన గర్వపడే సినిమా చేస్తానని అని.. ఇది తప్పకుండా ఆయన గర్వపడే సినిమా అవుతుంది అన్నారు.
నటుడు శివాజీరాజా మాట్లాడుతూ… కాకతుల్యం అయిన కూడా వినాయకరావ్, రామారావు న కెరీర్ మొదటినుంచి ఉన్నారు. ఈ ఫంక్షన్లలో రామసత్యనారాయన ఉండడం కూడా చాలా ఆనందంగా ఉంది. నేను ప్రొడ్యూసర్ ని ఇప్పుడే మొదటిసారి చూస్తున్నాను. కొత్తవారితో చేస్తే కథ కొత్తగా ఉంటుంది అని రమాకాంత్ గారితో చేయించాను సినిమా చాలా బాగా వచ్చింది. ప్రొడ్యూసర్ ఎక్కడా వెనకాడకుండా ఖర్చుపెట్టారు అని అన్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All