Homeరివ్యూస్ఇ ఈ రివ్యూ

ఇ ఈ రివ్యూ

నటీనటులు : నీరజ్ శ్యామ్ , నైరాశ
సంగీతం : కృష్ణ చేతన్
నిర్మాత : లక్ష్మణ్ రావు
దర్శకత్వం : రామ్ గణపతి రావు
రేటింగ్ : 3/ 5
రిలీజ్ డేట్ : 22 డిసెంబర్  2017
రామ్ గణపతి రావు దర్శకత్వంలో తెరకెక్కిన ” ఇ ఈ ” చిత్రం ఈరోజు రిలీజ్ అయ్యింది . నీరజ్ శ్యామ్ – నైరాశ జంటగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .
కథ :
అమ్మాయిలంటే అసహ్యించుకునే సిద్దు ( నీరజ్ శ్యామ్ ) కి గుది బండలా అతడి ఆఫీసు కి ఎండీగా వస్తుంది హాసిని ( నైరాశ ). మొదటి పరిచయం లోనే ఇద్దరికీ పడదు దాంతో ఉప్పు నిప్పు లా ఉంటుంది పరిస్థితి . అయితే అనూహ్యంగా సిద్దు హాసిని ప్రేమలో పడతాడు , ఓ గురూజీ శాపం వల్ల . నీరజ్ – నైరాశ ల ప్రేమాయణం సవ్యంగా సాగిపోతున్న సమయంలో మరొక వల్ల నీరజ్ – నైరాశ ల మధ్య కలహాలు వస్తాయి దాంతో శాప విమోచనం పొంది మరో రూపంలోకి వెళ్తాడు నీరజ్ . అసలు గురూజీ ఎవరు ? నీరజ్ ని ఎందుకు శపించాడు ? చివరకు నీరజ్ – నైరాశ ల జీవితం ఏమైంది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .
హైలెట్స్ :
సెకండాఫ్
నీరజ్
నైరాశ నటన
డ్రా బ్యాక్స్ :
ఫస్టాఫ్
నటీనటుల ప్రతిభ :
నీరజ్ శ్యామ్  బాగానే నటించాడు, ఫస్టాఫ్ లో ఒకలాగా ఉండే పాత్ర సెకండాఫ్ కు వచ్చేసరికి పూర్తిగా దానికి భిన్నంగా సాగే పాత్ర కావడంతో నటనకు మంచి అవకాశం లభించింది దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు  , నైరాశ కూడా  తన పాత్రకు పూర్తిగా న్యాయం చేసింది , అందం తో పాటుగా అభినయం తో ఆకట్టుకుంది . కమెడియన్ సుధాకర్ చాలాకాలం తర్వాత నటించిన చిత్రం ఈ ” ఇ ఈ ” మొత్తానికి అతడికి కూడా మంచి పాత్ర లభించింది .
సాంకేతిక వర్గం :
ఫస్టాఫ్ ని హీరో హీరోయిన్ ల మధ్య సన్నివేశాలతో  యావరేజ్ గా నడిపించినప్పటికీ సెకండాఫ్ లో మాత్రం దర్శకుడిగా విజృంభించాడు రామ్ గణపతిరావు . ఇంటర్వెల్ బ్యాంగ్ తో ఫస్టాఫ్ కి ముగింపు పలికిన గణపతి సెకండాఫ్ ని మాత్రం అదరగొట్టేలా రాసుకున్నాడు . ఊహించని ట్విస్ట్ లు ఇస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు . అయితే ఫస్టాఫ్ ని ఇంకాస్త బెటర్ గా రాసుకొని ఉంటే బాగుండేది . అమర్ అందించిన ఛాయాగ్రహణం ఈ సినిమాకు మరింత హెల్ప్ అయ్యింది . కృష్ణ చేతన్ అందించిన సంగీతం బాగుంది , రీ రికార్డింగ్ కూడా అలరించాడు . తక్కువ బడ్జెట్ లోనే చిత్రీకరించినప్పటికీ భారీ సినిమాని తలపించేలా నిర్మించి నిర్మాత దక్షత ఏంటో చూపించారు రావు సోదరులు .
ఓవరాల్ గా :
ఎమోషనల్ సీన్స్ , మదర్ సెంటిమెంట్ , సిస్టర్ సెంటిమెంట్ లకు గ్లామర్ ని యాడ్ చేసి ఊహించని ట్విస్ట్ లతో ” ఇ ఈ ” ని జనరంజకంగా రూపొందించారు . విభిన్న తరహా చిత్రాలను కోరుకునే ప్రేక్షకులకు నిజంగా  ఇదొక విభిన్న చిత్రమే !
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All