
ఇటీవల `జాతి రత్నాలు` చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్న స్వప్న సినిమా ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ ప్రధాన హీరోగా ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తోంది. సెన్సిబుల్ దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు. మొదటి షెడ్యూల్ చిత్రీకరణ కశ్మీర్‌లో మొదలైంది.
పిరియాడిక్ లవ్‌స్టోరీగా రూపొందుతున్న ఈ మూవీలో రామ్ అనే లెఫ్టినెంట్ గా దుల్కర్ సల్మాన్ కనిపించబోతున్నారు. సరిహద్దు వద్ద వీరోచితం పోరాడే ఓ సైనికుడిగా ఆయన పాత్ర చిత్రణ చాలా కొత్తగా వుండబోతోంది. యుద్ధం ముగిసిన వెంటనే తన ప్రేమను గెలిపించుకోవాలని తపించే ప్రేమికుడిగా దుల్కర్ విభిన్నమైన పాత్రలో నటిస్తున్నారు.
మద్రాస్ బెటాలియన్ కి చెందిన సైనికుడిగా ఈ చిత్రంలో దుల్కర్ కనిపించబోతున్నారు. ఇదిలా వుంటే శ్రీ రామ నవమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ దుల్కర్ సల్మాన్‌ను మద్రాస్ బెటాలియన్ లెఫ్టినెంట్ రామ్‌గా చూపించే ప్రత్యేక వీడియోను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ చిత్రానికి హీరోయిన్ తో పాటు కీలక తారాగణంకి సంబంధించిన వివరాల్ని చిత్ర బృందం త్వరలోనే వెల్లడించనుంది.
Lord Ram and his battle for love is legendary ????
Witness to see our Lieutenant Ram’s love saga soon!https://t.co/qPtn4OFKos@dulQuer @hanurpudi @Composer_Vishal @SwapnaCinema @VyjayanthiFilms#HappyRamNavami— Swapna Cinema (@SwapnaCinema) April 21, 2021