Homeగాసిప్స్మళ్ళీ ఓటిటి రిలీజ్ రూమర్స్ తో దృశ్యం 2

మళ్ళీ ఓటిటి రిలీజ్ రూమర్స్ తో దృశ్యం 2

మళ్ళీ ఓటిటి రిలీజ్ రూమర్స్ తో దృశ్యం 2
మళ్ళీ ఓటిటి రిలీజ్ రూమర్స్ తో దృశ్యం 2

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన దృశ్యం 2 చిత్రం షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాలు కూడా ముగిసి ఈ సినిమా నాలుగు నెలల క్రితమే విడుదలకు సిద్ధమైంది. అయితే అప్పుడు నారప్ప రిలీజ్ ఉండటంతో దృశ్యం 2ను వాయిదా వేశారు. దృశ్యం 2 విడుదల విషయంలో ఎలా చేయాలన్న సందిగ్దత ఎదుర్కొన్నాడు సురేష్ బాబు. మొదట డిస్నీ+హాట్ స్టార్ లో విడుదల చేస్తారన్న రూమర్స్ వచ్చాయి కానీ ఏమైందో తెలీదు కానీ ఆ డీల్ సెట్ అవ్వలేదు.

మళ్ళీ దృశ్యం 2ను థియేటర్స్ లోనే విడుదల చేయాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. దీంతో ప్రమోషన్స్ షురూ చేద్దామని ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ అప్పుడు అది కూడా వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం దృశ్యం 2 విడుదలపై మరోసారి నిర్ణయం మారినట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఈసారి సురేష్ బాబు అమెజాన్ ప్రైమ్ తో మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతోందని అంటున్నారు. డీల్ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయిందిట. ఒకవేళ ఇదే కనుక జరిగితే నారప్ప తర్వాత వరసగా  నటించిన రెండో సినిమా కూడా ఓటిటిలోనే విడుదలవుతుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All