Homeన్యూస్ఫైనల్ గా ఓటిటికే ఓటు వేసిన దృశ్యం2

ఫైనల్ గా ఓటిటికే ఓటు వేసిన దృశ్యం2

ఫైనల్ గా ఓటిటికే ఓటు వేసిన దృశ్యం2
ఫైనల్ గా ఓటిటికే ఓటు వేసిన దృశ్యం2

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన చిత్రం దృశ్యం. ఈ సమ్మర్ కే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. అత్యంత వేగంగా కేవలం 40 రోజుల్లో ఈ చిత్ర షూటింగ్ ను పూర్తి చేసాడు ఒరిజినల్ చిత్ర డైరెక్టర్ జీతూ జోసెఫ్. దృశ్యం2 విడుదల విషయంలో ఉన్న కన్ఫ్యూజన్ మొత్తానికి తొలగింది. దృశ్యం2 చిత్ర హక్కులను హాట్ స్టార్ సంస్థకు అమ్మేశాడు నిర్మాత సురేష్ బాబు.

అయితే ఈలోగా రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకోవడం, ప్రేక్షకులు కూడా థియేటర్లకు రావడానికి ఇష్టపడుతుండడంతో సురేష్ బాబు ఆలోచనల్లో మార్పు వచ్చింది. థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేద్దామా అని అనుకున్నాడు. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఇంకా టికెట్ ప్రైసింగ్ విషయంలో ఎటువంటి క్లారిటీ రాకపోవడంతో ఇప్పుడు థియేటర్స్ కు వెళ్లడం సరైంది కాదని భావించాడు.

- Advertisement -

దీంతో ముందుగా అనుకున్న ఓటిటి రిలీజ్ కే ఫైనల్ గా ఓటు వేసాడు సురేష్ బాబు. డిస్నీ + హాట్ స్టార్ లో ఈ చిత్రం స్ట్రీమ్ అవుతుంది. మలయాళంలో అమెజాన్ ప్రైమ్ లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన దృశ్యం2 చిత్రానికి అధికారిక రీమేక్ గా ఈ చిత్రం రూపొందింది. మీనా ఇందులో వెంకటేష్ భార్యగా నటిస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All