HomeVideosదృశ్యం 2 ట్రైలర్: మరోసారి తన కుటుంబాన్ని రాంబాబు కాపాడుకోగలడా?

దృశ్యం 2 ట్రైలర్: మరోసారి తన కుటుంబాన్ని రాంబాబు కాపాడుకోగలడా?

దృశ్యం 2 ట్రైలర్: మరోసారి తన కుటుంబాన్ని రాంబాబు కాపాడుకోగలడా?
దృశ్యం 2 ట్రైలర్: మరోసారి తన కుటుంబాన్ని రాంబాబు కాపాడుకోగలడా?

థ్రిల్లర్, ఫ్యామిలీ – ఈ రెండు జోనర్లను మిక్స్ చేసి దృశ్యం పేరుతో మలయాళంలో జీతూ జోసెఫ్ మ్యాజిక్ ను క్రియేట్ చేసాడు. ఆ సినిమా అప్పటికి మలయాళంలో హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచింది. మళ్ళీ ఇన్నేళ్లకి ఈ ఏడాది జీతూ జోసెఫ్ – మోహన్ లాల్ కాంబినేషన్ లో దృశ్యం 2 వచ్చింది. ఈ చిత్రాన్ని డైరెక్ట్ ఓటిటిలో అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేసారు. ఒక థ్రిల్లర్ సినిమాకు పెర్ఫెక్ట్ ముగింపు ఇచ్చాడని దర్శకుడు కితాబులందుకున్నాడు.

దృశ్యం చిత్రాన్ని తెలుగులో వెంకటేష్ తీసి సూపర్ హిట్ కొట్టిన విషయం తెల్సిందే. మరోసారి దృశ్యం2 ను కూడా రీమేక్ చేసాడు. రికార్డ్ టైమ్ లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మొదట థియేటర్లను ఉద్దేశించి తీశారు కానీ ఇప్పుడున్న కాంపిటీషన్ సరైన రిలీజ్ డేట్ పట్టుకోవడం కష్టమని భావించి మళ్ళీ అమెజాన్ ప్రైమ్ లోనే చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

- Advertisement -

నవంబర్ 25న ఈ చిత్రం స్ట్రీమ్ కానుంది. ఇక ఈరోజు ట్రైలర్ ను విడుదల చేసారు. అనుకోకుండా ఒక హత్య చేసిన తన కుటుంబాన్ని సినిమా తెలివితేటలతో కాపాడుకుంటాడు రాంబాబు. అయితే అనుకోకుండా మరో రూపంలో అదే కేసు రాంబాబు కుటుంబం మెడకు ఈసారి మరింత గట్టిగా చుట్టుకుంటుంది. ఈసారి ఏం చేస్తాడు? తన కుటుంబాన్ని కాపాడుకోగలడా? ట్రైలర్ చూస్తుంటే ఫెయిత్ ఫుల్ రీమేక్ అన్న భావన కలుగుతోంది.

ఇవి కూడా చదవండి:
అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానున్న దృశ్యం 2
మళ్ళీ ఓటిటి రిలీజ్ రూమర్స్ తో దృశ్యం 2
సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న దృశ్యం 2
దృశ్యం 2 ప్లాన్స్ మళ్ళీ మారాయిగా!

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All