Homeటాప్ స్టోరీస్రాజశేఖర్ సినిమా రిలీజ్ కాలేదు

రాజశేఖర్ సినిమా రిలీజ్ కాలేదు

Dr. rajasekhar's Arjuna postponed againఈరోజు సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ నటించిన ” అర్జున ” చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసారు కానీ తీరా సమయానికి రకరకాల కారణాల వల్ల అర్జున సినిమా రిలీజ్ కాలేదు . అయినా ఈ సినిమా ఇప్పటిది కాదు దాదాపు పదేళ్ల క్రితం నాటి సినిమా . ఇన్నాళ్లు ల్యాబ్ లో ఉండిపోయిన సినిమాని సి . కళ్యాణ్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసాడు . అయితే ఆర్ధిక విషయాలన్నీ కొలిక్కి రానట్లున్నాయి అందుకే సినిమా రిలీజ్ ఆగిపోయింది .

 

- Advertisement -

రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన అర్జున చిత్రంలో డాక్టర్ రాజశేఖర్ ద్విపాత్రాభినయం పోషించాడు . పదేళ్ల నాటి రాజకీయ పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా వేరు దాంతో అర్జున సినిమాని ఇప్పుడు రిలీజ్ చేసి ప్రయోజనం లేదని భావిస్తున్నాడు డాక్టర్ రాజశేఖర్ . తాజాగా ఈ హీరో కల్కి అనే చిత్రంలో నటిస్తున్నాడు .

English Title : Dr. rajasekhar’s Arjuna postponed again

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All