Homeటాప్ స్టోరీస్ఎనిమిదేళ్ల నాటి సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతోంది

ఎనిమిదేళ్ల నాటి సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతోంది

Dr . Rajasekhar's Arjuna gets release date8 ఏళ్ల క్రితం నాటి సినిమా ఇన్నాళ్ల తర్వాత రిలీజ్ కి సిద్ధమైంది . సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ హీరోగా నటించిన ” అర్జున ” చిత్రం కన్మణి దర్శకత్వంలో తెరకెక్కింది . రాజశేఖర్ ద్విపాత్రాభినయం పోషించిన ఈ చిత్రం రాజకీయ నేపథ్యంలో రూపొందింది . మరికొద్ది రోజుల్లో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాని రిలీజ్ చేయడం యాదృచ్ఛికం .

 

- Advertisement -

రాజశేఖర్ మార్కెట్ పూర్తిగా పడిపోవడంతో ఈ సినిమా మరుగున పడిపోయింది , అయితే సి కళ్యాణ్ ఎట్టకేలకు మూలాన పడిఉన్న సినిమాని రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చాడు . ఈనెల 15 న అర్జున చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . రాజశేఖర్ కు ఈ సినిమా హిట్ నిస్తుందో ? లేదో కానీ సినిమా రిలీజ్ కావడమే పెద్ద విజయం అన్నట్లుగా ఉంది పరిస్థితి .

English Title:  Dr . Rajasekhar’s Arjuna gets release date

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All