Wednesday, March 22, 2023
Homeటాప్ స్టోరీస్తిత్లీ తుపాను బాధితుల‌కు రూ.10 ల‌క్ష‌లు విరాళం ప్ర‌క‌టించిన జీవిత‌, రాజ‌శేఖ‌ర్‌

తిత్లీ తుపాను బాధితుల‌కు రూ.10 ల‌క్ష‌లు విరాళం ప్ర‌క‌టించిన జీవిత‌, రాజ‌శేఖ‌ర్‌

Dr. Rajasekhar & Jeevitha Rajasekhar have contributed Rs 10 lakh towards Cyclone Titli in Srikakulamప్ర‌కృతి మాన‌వుడిపై క‌న్నెర జేసిన ప్ర‌తిసారీ మ‌నిషికి మ‌నిషే తోడుగా నిల‌బ‌డుతున్నాడు. ఇది చాలా సందర్భాల్లో నిరూప‌ణ అయ్యింది. ఇటీవ‌ల తిత్లీ తుపాను కార‌ణంగా శ్రీకాకుళం జిల్లాలోని 165 గ్రామాలు స‌మ‌స్య‌ల్లో చిక్కుకున్నాయి. జ‌న జీవ‌నం అస్త‌వ్య‌స్థ‌మైంది. ఆస్థి న‌ష్టం ఎక్కువ‌గా జ‌రిగింది.

- Advertisement -

ప్ర‌భుత్వం త‌గు చ‌ర్య‌లు తీసుకుంటున్నా.. త‌మ వంతుగా సినీ ప‌రిశ్ర‌మ బాధితుల‌కు ఆప‌న్న హస్తాన్ని అందించ‌డానికి ముందుకు వ‌చ్చింది. అందులో భాగంగా హీరో రాజ‌శేఖ‌ర్‌, ఆయ‌న స‌తీమ‌ణి జీవిత తుపాను బాధితుల‌కు రూ.10 ల‌క్ష‌లు విరాలాన్ని అందించారు. ఆంధ్ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుని అమ‌రావ‌తిలోని ఆయ‌న స్వ‌గృహంలో నేరుగా క‌లుసుకుని రూ.10 ల‌క్ష‌ల చెక్‌ను ఆయ‌న‌కు అందించారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts