Homeటాప్ స్టోరీస్ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా ఇవ్వనున్న ఎన్టీఆర్

ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా ఇవ్వనున్న ఎన్టీఆర్

double dhamaka for ntr fansయంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ కి డబుల్ ధమాకా ఇవ్వనున్నాడు . ఈనెల 20 న ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వస్తున్న సినిమా తాలూకు తీపి కబురు ని అందించనున్నారట ! అలాగే ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో చరణ్ తో కలిసి మల్టీస్టారర్ చిత్రంలో ఎన్టీఆర్ నటించనున్న విషయం కూడా విదితమే దాంతో ఆ సినిమా తాలూకు న్యూస్ ని కూడా అభిమానులకు షేర్ చేయాలని భావిస్తున్నాడట రాజమౌళి అంటే మే 20 న ఎన్టీఆర్ అభిమానులకు డబుల్ ధమాకా అన్నమాట .

ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు ఆ చిత్రంలో ఎన్టీఆర్ తో పూజా హెగ్డే రొమాన్స్ చేయనుంది . ఆ సినిమా షూటింగ్ జరుగుతోంది . రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం పై ఎన్టీఆర్ కంటే త్రివిక్రమ్ ఎక్కువ ఆశలు పెట్టుకున్నాడు ఎందుకంటే అజ్ఞాతవాసి చిత్రంతో డిజాస్టర్ అందుకున్నాడు కాబట్టి . ఇక రాజమౌళి దర్శకత్వంలో రాబోయే మల్టీస్టారర్ చిత్రం గురించి కూడా ఓ తీపి కబురు అందించాలని భావిస్తున్నారట . మొత్తానికి ఈ పుట్టినరోజు ఎన్టీఆర్ తో పాటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు కూడా తీపి జ్ఞాపకమే !

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All