
ఆర్ఆర్ఆర్ నుండి దోస్తీ ఫుల్ వీడియో సాంగ్ గురువారం(ఏప్రిల్ 21)న సాయంత్రం 4 గంటలకు విడుదల కాబోతుంది. రీసెంట్ గా నాటు నాటు, కొమ్మ ఉయ్యాలా ఫుల్ వీడియో సాంగ్స్ విడుదల చేసి ఆకట్టుకున్నారు. ఎమ్ఎమ్ కీరవాణి స్వర పరిచిన బాణీలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. విడుదలకు ముందే ఈ పాటలు యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌ను సాధించాయి.
ఈ సినిమాలోని రామ్ చరణ్- తారక్ మధ్య సాగే దోస్తీ పాటకు ఫిదా అయ్యారు అభిమానులు. సినిమా విడుదల తర్వాత పూర్తి వీడియో సాంగ్ ఎప్పుడొస్తుందో అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సాంగ్ తాలూకా అప్డేట్ ఇచ్చి అభిమానుల్లో సంతోషం నింపారు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 25న విడుదలై భారీ కలెక్షన్లను రాబడుతుంది. నైజాంలో 100కోట్ల మార్కును టచ్ చేసిన మొదటి సినిమాగా రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఈ మూవీ విడుదలై 25 రోజులు దాటినా ఇంకా థియేటర్స్ లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.