శివాత్మిక – ఆనంద్ దేవరకొండ హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న చిత్రం దొరసాని . మహేంద్ర దర్శకత్వంలో మధుర శ్రీధర్ – యష్ రంగినేని సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని జూలై 5 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఈరోజు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన చిత్ర బృందం దొరసాని చిత్రంపై అంచనాలు పెంచేలా చేసారు . శివాత్మిక దొరసాని లుక్ లో చాలా బాగుంది , అయితే దొరసాని ని ప్రేమించే యువకుడిగా ఆనంద్ దేవరకొండ మాత్రం అంతగా ఆకట్టుకునేలా కనిపించడం లేదు .
సినిమా చూస్తే కానీ తెలీదు ఆనంద్ దేవరకొండ విజయ్ దేవరకొండ స్టార్ డం ని అందుకునేలా ఉన్నాడా ? లేదా ? అన్నది . జూన్ 6 న దొరసాని టీజర్ ని రిలీజ్ చేస్తున్నారు , ఇక సినిమాని జూలై 5 న విడుదల చేయనున్నారు . రాజశేఖర్ – జీవిత ల కూతురు శివాత్మిక , విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన చిత్రం కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి . మరి ఆ అంచనాలను ఈ దొరసాని అందుకుంటుందా ? చూడాలి .