Homeటాప్ స్టోరీస్బిగ్ బాస్ చూడటమే ఎక్కువ ఇంకా బజ్ మాకెందుకు?

బిగ్ బాస్ చూడటమే ఎక్కువ ఇంకా బజ్ మాకెందుకు?

BIGG BOSS 3 Telugu
BIGG BOSS 3 Telugu

గడిచిన 2 నెలలుగా బుల్లితెర మీద ఒక రియాలిటీ షో బాగా పేరు సంపాదించింది, అది కూడా మన తెలుగు వారి సొంత ఆలోచన కాదు, పక్కన బాలీవుడ్ నుండి దిగుమతి అయిన షో, అందులోను  తెలుగులొ మొదటి 2 సీజన్స్ బాగా పేరు రావటం, ఇలా తెలుగు “బిగ్ బాస్ సీజన్ 3” కి ప్రజల దగ్గర నుండి ఒస్తున్న మద్దతు.

అల 2 సీజన్స్ బాగా ఒచ్చాయని మూడవ సీజన్ ని కూడా ఏదోకటి కొత్తగా  చేసేస్తే జనాలు చూస్తారు అని, 3 వ సీజన్ ని ఒక గంట వరకి మాత్రమే కుదించారు, నిజానికి గడిచిన 2 సీజన్స్ ప్రచారం అయ్యే టైం 1 గంట 30 నిమిషాలు, మరి 3 వ సీజన్ ని రొటీన్ గ చేయకుండా ఇక 30 నిమిషాలు కోసేసి, దానికి ఆ 30 నిమిషాలు ఎం జరిగింది అని వాళ్ళకి చూపించాలి కాబట్టి, ఒక షో ప్లాన్ చేద్దాం అని దానికి ఒక పేరు పెట్టారు “బిగ్ బాస్ బజ్ ” అంటే మనం 1 గంట లొ చూసినవి కాకుండా,  మనకి చూపియ్యనివి మరుసటి రోజు చూపించేలా ఐడియా వేసి ఒక షోని ప్లాన్  చేసారు.

- Advertisement -

ప్లాన్ చేయడం అంటే చూసి రాసినంత ఈజీ కాదు అందులో చాలా కథ ఉండాలి, అందుకే జనాలకు అర్ధం అయిపోయి అసలైన బిగ్ బాస్ ని చూస్తున్నారు కానీ, దానికి పొడిగింపున ఒస్తున్న బజ్ ని మాత్రం ఎవ్వరు పెట్టించుకునే నాధుడే లేడు, పైగా ఆదివారం ఎవరైతే తక్కువ ఓట్లు వచ్చి బయటికి వెళ్ళిపోతే వారిని వాళ్ళ మనోభావాలు తెలుసుకోవాలని హీరో “తనీష్” ని పెట్టేసి సోమవారం ఆ బజ్ లోనే ఇంటర్వ్యూ ప్రాసెస్ ల చేసారు, ఇక బజ్ ని చూడడానికి మాకు ఇంటరెస్ట్ లేదు అంటుంటే మాకు ఎందుకు బాబు ఈ ఇంటర్వ్యూ  అని జనాలు చూడటం కూడా మానేశారు, మరి ఛానల్ వాళ్ళ దగ్గరికి ఈ న్యూస్ వెళ్లి బజ్ ని ఆపేస్తారో, లేక కొత్తగా ఎమన్న కొత్తగా ప్రయత్నిస్తారో వేచి చూద్దాం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All