
లోఫర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన భామ దిశా పటానీ.. లోఫర్ చిత్రం ఫ్లాప్ కావడంతో ఈ భామకు తెలుగులో అవకాశాలు లేకుండాపోయాయి . అయితే బాలీవుడ్ లో మాత్రం బాగానే రాణిస్తోంది. ప్రస్తుతం ఈ భామ లో దుస్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ..హాట్ హాట్ ఇన్నర్ వేర్ లో మిసమిసలాడే అందాలు చూపిస్తూ ఫాలోయర్స్ ను పెంచుకుంటుంది. ఇదిలా ఉంటె ఈ భామ టైగర్ ష్రాఫ్ తో డేటింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. పలుమార్లు వీరిద్దరూ కలిసిన ఉన్న పిక్స్ బయటకు రాగ..తాజాగా ఒక రూమ్ లో వీరిద్దరూ ఉన్న పిక్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.
ఈ ఫోటో లో టైగర్ ష్రాఫ్ వర్కౌట్ చేసే డంబెల్స్ కూడా కనిపిస్తున్నాయి. దీంతో అతడి ఇంటికి ఈ హీరోయిన్ వెళ్లిందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు తనకు తోచినట్లుగా బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు. దిశా పటానీ.. టైగర్ ష్రాఫ్ ‘భాగీ 2’ అనే సినిమాలో జంటగా నటించారు. ఆ మూవీ సమయంలోనే వీళ్లిద్దరూ ప్రేమలో పడిపోయారు. అప్పటి నుంచి చాలా కాలం పాటు ఈ జంట రహస్యంగా తమ ట్రాకును నడిపించింది. అప్పుడు జంటగా పలుమార్లు కెమెరా కంటికి చిక్కినప్పటికీ.. ప్రేమలో ఉన్న విషయాన్ని మాత్రం తెలుపలేదు.