Homeటాప్ స్టోరీస్షూటింగ్ లో గాయాలపాలైన హీరోయిన్

షూటింగ్ లో గాయాలపాలైన హీరోయిన్

disha patani injured in salmans shootingహాట్ భామ దిశా పటాని యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొంటూ అదుపు తప్పడంతో గాయాల పాలయ్యింది . మోకాలి చిప్ప కు కాస్త గట్టిగానే దెబ్బ తగలడంతో షూటింగ్ కి బ్రేక్ పడింది . తాజాగా ఈ భామ సల్మాన్ ఖాన్ సరసన నటిస్తున్న చిత్రం ” భరత్ ” . అబ్బాస్ అలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ తో పోటీ పడి నటించడానికి రెడీ అయ్యింది . భాగీ 2 లో యాక్షన్ సన్నివేశాల్లో దిశా పటాని అదరగొట్టింది దాంతో సల్మాన్ సినిమా కోసం ఈ భామని తీసుకున్నారు . ముందుగానే యాక్షన్ సీక్వెన్స్ గురించి చెప్పడంతో మళ్ళీ అందుకు తగిన శిక్షణ తీసుకుంది కానీ తీరా షూటింగ్ సమయానికి అనుకున్న స్థాయిలో చేయలేక పోవడంతో మోకాలి కి దెబ్బలు తగిలాయి .

గాయాల పాలవ్వడంతో ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటోంది దిశా పటాని . ఇక హీరోయిన్ తో కాంబినేషన్ సీన్స్ కాబట్టి షూటింగ్ ని దిశా కోసం వాయిదా వేశారు . సల్మాన్ వంటి స్టార్ హీరో చిత్రంలో నటించే ఛాన్స్ వచ్చిందని పడిన సంతోషం ఎక్కువ సేపు నిలవలేదు పాపం ఈ భామకు . గ్లామర్ తోనే కాకుండా యాక్షన్ తో కూడా ప్రేక్షకులను అలరించడానికి సమాయత్తం అవుతున్న ఈ భామ త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం .

- Advertisement -

English Title: disha patani injured in salmans shooting

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All