HomePolitical Newsపోలవరంపై మళ్లీ చర్చ మొదలైంది

పోలవరంపై మళ్లీ చర్చ మొదలైంది

పోలవరంపై మళ్లీ చర్చ మొదలైంది
పోలవరంపై మళ్లీ చర్చ మొదలైంది

పోలవరంపై మళ్లీ చర్చ మొదలైంది. ప్రాజెక్ట్‌ హైట్‌పై ఏపీ, తెలంగాణ మధ్య 5గ్రామాల పంచాయితీ తెగడం లేదు. గోదావరి ఎగపోటుతో భద్రాచలం ముంపునకు పోలవరమే కారణమంటూ తెలంగాణ అసెంబ్లీలో విస్తృత చర్చ జరిగింది. మంత్రి పువ్వాడ అజయ్‌, ఎమ్మెల్యే సండ్ర పోలవరం ముంపు సమస్యను ప్రస్తావించారు. ఏపీలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్ట్‌ వల్ల భద్రాచలంలో గోదావరికి వరద ప్రమాదం పొంచి ఉందని, ఇటీవల గోదావరికి వచ్చిన వరదే అందుకు నిదర్శనమన్నారు. ఈ నేపథ్యంలో ముంపుపై అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీ ఈనెల 14న వెళ్లింది. పూర్తి స్ధాయిలో అధ్యయనం చేసి రిపోర్ట్‌ తయారు చేసేందకు తెలంగాణ ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. అంతేకాదు ఇటు.. భద్రాచలం, ఇతర ప్రాంతాలు ముంపునకు గురికాకుండా తీసుకోవాల్సిన చర్యలనుఈ కమిటీ సిఫార్సు చేయనుంది.

భద్రాచలం దగ్గర చాలా మంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారని, పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంచి నిర్మిస్తున్నా కేంద్రం చర్యలు తీసుకోవడం లేదని, దీనిపై కేంద్ర జలసంఘం, గోదావరి బోర్డు యాజమాన్యం అధ్యయనం చేసి ఎత్తు తగ్గించాలని డిమాండ్‌ చేశారు తెలంగాణ నేతలు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ముందు గోదావరి వరద త్వరగా తగ్గుముఖం పట్టేదని, కానీ ఇప్పుడు తగ్గుముఖం పట్టేందుకు చాలా సమయం పడుతోందన్నారు. రోజుల తరబడి గ్రామాలు వరద ముంపులోనే ఉంటున్నాయన్నారు. ముంపు మండలాల ప్రజలు మమ్మల్ని తెలంగాణలో కలపాలని ధర్నాలు, దీక్షలు చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు మంత్రి హరీష్‌రావు. ఏపీ ప్రభుత్వం.. బీజేపీతో పొత్తులో ఉంటే.. తమ రాజకీయాల కోసం తెలంగాణ

- Advertisement -

ప్రజల గొంతు కోసేలా ఏడు మండలాలు, లోయర్‌ సీలేరును ఆంధ్రాలో కలిపారన్నారు. ప్రాజెక్టులో మొదట 36లక్షల క్యూసెక్కుల నీటి సామర్థ్యంతో డిజైన చేసి, ఇప్పుడు 50లక్షల క్యూసెక్కులకు నీటి సామర్థ్యానికి పెంచారని, దీంతో డ్యామ్‌ నుంచి నీరు విడుదల త్వరగా జరగని పరిస్థితి ఉందన్నారు. ఈ పరిస్థితి వల్ల గోదావరి వరద ఉద్దృతి పెరిగి గ్రామాలు ముంపుకు గురువుతున్నాయని, భద్రాచలం రాముడు కూడా మునిగిపోయే ప్రమాదం ఉన్నా…బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. అంతేకాదు.. గోదావరి వరదల నుంచి భద్రాచలం ప్రాంతాన్ని పరిరక్షించేలా కేంద్ర ప్రభుత్వం స్పందించాలని, ఏపీలోకి వెళ్లిన ఆ 5 గ్రామ పంచాయతీలను తెలంగాణాలో కలపాలని డిమాండ్‌ చేశారు టీఆర్‌ఎస్‌ మంత్రులు. భద్రాద్రి రాములవారిని కాపాడేందుకు కేంద్రం ఏపీ ప్రభుత్వంతో మాట్లాడాలన్నారు. ఇప్పటికే సమస్యను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకువెళ్లిందని, అయినా స్పందించలేదని ఆరోపించారు. కరకట్ట నిర్మించాలన్నా ఏపీలో ఉన్న ఐదు పంచాయతీలు అవసరమని, రాముడి పేరుచెప్పి రాజకీయం చేస్తున్న బీజేపీ ..ఇప్పుడు రాముడికే ప్రమాదం ఉందని తెలుసుకుని స్పందించాలన్నారు. మరి తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాలు, అంశాలపై ఏపీ ప్రభుత్వం ఎలాంటి సమాధానం చెబుతుంది. నిపుణుల కమిటీ ఏం తేలుస్తుందో వేచి చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All