Homeటాప్ స్టోరీస్లోక్ సభలో భరత్ అనే నేను చర్చ

లోక్ సభలో భరత్ అనే నేను చర్చ

discussion on bharath ane nenu movie in lok sabhaమహేష్ బాబు హీరోగా నటించిన ” భరత్ అనే నేను ” చిత్రం గురించి లోక్ సభలో చర్చ జరగడం విశేషం . మహేష్ బాబు బావ గుంటూరు పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్ కేంద్ర ప్రభుత్వం పై పెట్టిన అవిశ్వాస తీర్మానం పై చర్చ సందర్బంగా మహేష్ నటించిన భరత్ అనే నేను చిత్రం గురించి మాట్లాడాడు . టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అయిన భరత్ అనే నేను చిత్రం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని చాటి చెప్పే చిత్రమని , హీరో ఎన్నారై అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న తండ్రి చనిపోతే అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చిన భరత్ తల్లికి ఇచ్చిన మాట కోసం , రాజకీయాల్లోకి వచ్చిన సందర్బంగా ప్రజలకు సేవ చేస్తానని ఇచ్చిన మాట కోసం నిలబడిన వాడి కథ అని అందుకే ఆ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టరాని గుర్తు చేస్తూ మోడీ , అమిత్ షా లు ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన మాట తప్పడం పై చర్చ లో ప్రసంగించడం అందరినీ ఆకట్టుకుంది .

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించి ఇప్పుడేమో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లేదని లెక్కలతో సహా వెల్లడించాడు గల్లా జయదేవ్ . రాజకీయాల సంగతి పక్కన పెడితే భరత్ అనే నేను చిత్రం గురించి పార్లమెంట్ లో చర్చించడం మహేష్ కు గర్వకారణమనే చెప్పాలి . గల్లా జయదేవ్ మహేష్ కు స్వయానా బావ అన్న విషయం తెలిసిందే .

- Advertisement -

English Title: discussion on bharath ane nenu movie in lok sabha

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All