Homeటాప్ స్టోరీస్డిస్కో రాజా మూవీ రివ్యూ

డిస్కో రాజా మూవీ రివ్యూ

డిస్కో రాజా మూవీ రివ్యూ
డిస్కో రాజా మూవీ రివ్యూ

మూవీ రివ్యూ: డిస్కో రాజా
నటీనటులు: రవితేజ, నభ నటేష్, పాయల్ రాజ్ పుత్, తాన్య హోప్, బాబీ సింహా, సునీల్, సత్య తదితరులు
దర్శకత్వం: విఐ ఆనంద్
నిర్మాత: రజినీ తాళ్లూరి
సంగీతం: ఎస్ ఎస్ థమన్
విడుదల తేదీ: జనవరి 24, 2020
రేటింగ్: 3.5/5

గత మూడేళ్ళలో రవితేజ నుండి ఒక్క ప్రామిసింగ్ సినిమా కూడా రాలేదు. అయితే విడుదలకు ముందు నుండీ డిస్కో రాజా ప్రేక్షకులలో అంచనాలు క్రియేట్ చేయడంలో సక్సెస్ అయింది. ఈ సినిమా ఒక విభిన్నమైన చిత్రమన్న ఫీలింగ్ అందరిలో కలిగింది. టాలెంటెడ్ దర్శకుడు విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో చూద్దామా.

- Advertisement -

కథ:
సైన్స్ ల్యాబ్ లో జరిగే ఒక ప్రయోగం వల్ల బ్రెయిన్ డెడ్ పెర్సన్ వాసు (రవితేజ) మాములు మనిషవుతాడు. అయితే తన గతం మొత్తం మర్చిపోతాడు. తనెవరో తెలుసుకునే క్రమంలో ఎంపీతో గొడవ పెట్టుకుంటాడు. దానివల్ల వాసు ఫేమస్ అయ్యి తన వాళ్ళను చూడగలుగుతాడు. అంతే కాకుండా చెన్నై నుండి సేతు (బాబీ సింహా) డిస్కో రాజ్ (రవితేజ)కు వాసుకు సంబంధం ఉందనుకుని వెతుక్కుంటూ వస్తాడు. ఇంతకీ వాసు మీద జరిగిన ప్రయోగం వల్ల వాసు బాడీకి ఏం జరుగుతుంది? సేతు ఎవరు? డిస్కో రాజ్ కు వాసుకు ఉన్న సంబంధమేంటి? వాసు కు డిస్కో రాజ్ కు ఉన్న గొడవలేంటి? చివరికి ఏమైంది?

నటీనటులు:
రవితేజ ఈ చిత్రంలో విభిన్నంగా అనిపిస్తాడు. ఎప్పుడూ ఎనర్జిటిక్ గా ఉండే రవితేజను కాకుండా సినిమా మొదట్లో సరికొత్త రవితేజను చూస్తాం. చాలా సటిల్ యాక్టింగ్ తో తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించాడు మాస్ మహారాజా. అయితే ఒక్కసారి డిస్కో రాజా పాత్ర ఎంట్రీ ఇచ్చాక కథ మారిపోతుంది. డిస్కో రాజా పాత్రలో రవితేజ పూర్తిగా మెప్పిస్తాడు. తనకలవాటైన మ్యానరిజమ్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసాడు. డిస్కో రాజ్ తెర మీద ఉన్నంతసేపూ ప్రేక్షకులకు బోర్ కొట్టదు అంటే చూసుకోండి. మొత్తంగా రవితేజకు యాక్టింగ్ పరంగా మంచి మార్కులు వేయించుకునే అవకాశం కల్పించింది రవితేజ. మూడు భిన్నమైన షేడ్స్ ను రవితేజ చాలా సులువుగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు.

ఇక పాయల్ రాజ్ పుత్, నభ నటేష్, తాన్య హోప్ లకు చాలా తక్కువ స్క్రీన్ స్పేస్ లభించింది. ఉన్నంతలో పాయల్ పాత్రకు కొంత ప్రాధాన్యత ఉంది. హెలెన్ పాత్రలో ఆమె నటన బాగుంది. విలన్ గా నటించిన బాబీ సింహా అదరగొట్టాడు. తనని ఎందుకందరూ గొప్ప నటుడంటారో మరోసారి ఈ సినిమా ద్వారా చూపించాడు. సునీల్ కు ఒక విభిన్నమైన పాత్ర లభించింది. అతని పాత్ర మిశ్రానుభూతులు మిగుల్చుతుంది. అలానే సత్య, వెన్నెల కిషోర్ ఉన్న కాసేపూ నవ్వించడానికి ప్రయత్నించారు కానీ అంత వర్కౌట్ అవ్వలేదు. మిగిలిన వాళ్లంతా మామూలే.

సాంకేతిక వర్గం:
ముందుగా థమన్ మ్యూజిక్ గురించి ప్రస్తావించుకోవాలి. పాటలన్నీ ఇప్పటికే సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. వాటిని తెరపై ఇంకా బాగా చూపించారు. రెండు పాటల్లో కథ కూడా భాగంగా ఉంటుంది. థమన్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పూర్తి మార్కులు వేయించుకుంటాడు. ఫ్రీక్ అవుట్ మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఐస్ ల్యాండ్ లో సన్నివేశాలు బాగా చిత్రీకరించారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కూడా ఫ్రేమ్స్ ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్ క్రిప్స్ గా ఉంది. ఫైట్స్ ఓకే. కథ విభిన్నంగా మొదలైనా తర్వాత రెగ్యులర్ రివెంజ్ డ్రామా రూట్ తీసుకుంటుంది. విఐ ఆనంద్ దర్శకత్వం కూడా మిక్స్డ్ ఫీలింగ్స్ కలిగిస్తుంది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు.

విశ్లేషణ:
డిస్కో రాజా మొదలుపెట్టిన విధానం, ఆ తర్వాత ల్యాబ్ లో చేసిన ప్రయోగం, ఆపై ఇంటర్వెల్ కు ముందు డిస్కో రాజ్ పాత్ర పరిచయం.. ఇలా చకచకా సాగిపోతుంది. సెకండ్ హాఫ్ మొదలైన తీరు కూడా ఆకట్టుకుంటుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాగా వచ్చింది. అయితే ఒక్కసారి మళ్ళీ ప్రెజంట్ కు వచ్చాక రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లోకి మారిపోతుంది చిత్రం. అలాగే ముందు చూపించిన ల్యాబ్ ప్రయోగం మళ్ళీ ఎక్కడా ప్రస్తావనకు రాదు. ఇవి పక్కన పెడితే డిస్కో రాజ్ పాత్ర ఒక్కటే పైసా వసూల్ అనిపిస్తుంది. ఇందులో రవితేజ ఎనర్జీ చూస్తే ఫ్యాన్స్ కు పండగే.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All