Saturday, October 1, 2022
Homeటాప్ స్టోరీస్ఈ ఏడాది కూడా రకుల్ కు డిజాస్టరే

ఈ ఏడాది కూడా రకుల్ కు డిజాస్టరే

ఈ ఏడాది కూడా రకుల్ కు డిజాస్టరే
ఈ ఏడాది కూడా రకుల్ కు డిజాస్టరే

సినిమా వాళ్ళ జీవితాలు అస్సలు నిలకడ లేనివని అంటుంటారు. ఒక్క శుక్రవారంతో ఇక్కడ చాలా మంది జీవితాలు తారుమారవుతుంటాయి. స్టార్స్ గా వెలుగుతున్న వాళ్ళు టపీమని నెలకు పడిపోతారు, లేదా డౌన్ లో ఉన్న వాళ్ళు కూడా ఒకేసారి టాప్ రేంజ్ కు చేరుకుంటారు. రకుల్ ప్రీత్ కెరీర్ లో కూడా అలాంటి ఒక శుక్రవారం స్పైడర్ రిలీజైన రోజు. ఈ సినిమాలో సాధించిన పరాజయం, అందులో ఆమె చేసిన పాత్రకు వచ్చిన క్రిటిసిజం ఇలా అన్నీ రకుల్ కు చెడే చేసాయి. 2017లో వచ్చిన స్పైడర్ తర్వాత రకుల్ కు తెలుగులో ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ సినిమా రాలేదు. అసలు 2018లో ఒక్క సినిమా కూడా చేయలేదు రకుల్. 2019లో చేసినా కానీ అవేమీ తన కెరీర్ కు ఉపయోగపడేవి కాదు.

- Advertisement -

2019 ఆరంభంలో ఆమె ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో శ్రీదేవి పాత్ర పోషించింది. ఆ పాత్ర నిడివి కాసేపే కావడం, పైగా సినిమా కూడా డిజాస్టర్ గా మిగలడంతో రకుల్ కు ఈ సినిమా ప్లస్ కాలేకపోయింది. అలాగే కార్తీ హీరోగా వచ్చిన దేవ్ అటు తమిళంలో, ఇటు తెలుగులో కూడా అట్టర్ ప్లాప్. ఇదే ఏడాది సూర్యతో చేసిన ఎన్జీకే పరిస్థితి కూడా ఇంతే. అన్నదమ్ములతో చేసినా రకుల్ కు సక్సెస్ మాత్రం రాలేదు. ఇక నాగార్జున హీరోగా వచ్చిన మన్మథుడు 2 గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఈ చిత్రం ఏ రేంజ్ లో డిజాస్టర్ అయిందో అందరికీ తెల్సిందే. సీనియర్ హీరోతో నటించడానికి సిద్ధపడినా సరే ఇప్పుడు రకుల్ కు తెలుగులో అవకాశాల్లేవు. మన్మథుడు 2 తర్వాత మరో తెలుగు సినిమా సైన్ చేయలేదు రకుల్.

అలాగే మూడేళ్ళ క్రితం హైదరాబాద్ కు షిఫ్ట్ అయిన రకుల్, ఇప్పుడు తిరిగి ముంబైలో మకాం పెట్టింది. ఇక్కడి మేనేజర్ ను కూడా ఫైర్ చేసేసిందిట. తన సినిమా బాధ్యతలు మొత్తం రానా దగ్గుబాటికి చెందిన సెలబ్రిటీ మానేజ్మెంట్ సంస్థ క్వాన్ చేతిలో పెట్టినట్లు సమాచారం. అయితే రకుల్ ప్రస్తుతం రెండు పేరున్న తమిళ చిత్రాల్లో నటిస్తోంది. ఒకటి ఇండియన్ 2, మరొకటి శివ కార్తికేయన్ సినిమా. ఈ రెండు సినిమాలు సక్సెస్ అయితే రకుల్ కు మళ్ళీ సౌత్ లో అవకాశాలు వస్తాయేమో చూడాలి. అన్నట్లు సౌత్ లో రకుల్ కు ప్లాపులొచ్చినా హిందీలో మాత్రం సక్సెస్ సాధించింది. మార్జావన్, దే దే ప్యార్ దే.. రెండూ కూడా విజయాలు సాధించాయి. ప్రస్తుతం రెండు తమిళ చిత్రాలతో పాటు మరో హిందీ సినిమా చేస్తోంది రకుల్.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts