Monday, October 3, 2022
Homeటాప్ స్టోరీస్2019 ఎండింగ్: ఆశించినంత లేదుగా!

2019 ఎండింగ్: ఆశించినంత లేదుగా!

2019 ఎండింగ్: ఆశించినంత లేదుగా!
2019 ఎండింగ్: ఆశించినంత లేదుగా!

ఈ 2019 ఆరంభం టాలీవుడ్ కు ఏమాత్రం కలిసిరాలేదు. కచ్చితంగా హిట్ అవుతాయన్న ఎన్టీఆర్ కథానాయకుడు, వినయ విధేయ రామ చిత్రాలు సోదిలో లేకుండా పోయాయి. ఈ సినిమాల పరాజయాలు టాలీవుడ్ పై గట్టి ఎఫెక్ట్ చూపించాయి. మొత్తానికి హిట్లు, ప్లాపులతో ఈ ఏడాది ముగింపుకు టాలీవుడ్ ఎలాగోలా చేరుకుంది. ఆరంభం బాలేని కారణంతో కనీసం ఎండింగ్ అయినా కలిసొస్తుంది అనుకుంటే ఈ ఏడాది ఎండింగ్ కూడా అసంతృప్తిగానే ముగించాల్సి వచ్చేలా ఉంది.

- Advertisement -

డిసెంబర్ 20న నాలుగు చిత్రాలు విడుదలవ్వగా దేనికీ కూడా బ్లాక్ బస్టర్ టాక్ రాలేదు. దొంగ, దబంగ్ 3 చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. నందమూరి బాలకృష్ణ నటించిన రూలర్ అయితే డిసాస్టర్ దిశగా పయనిస్తోంది. ఉన్నవాటిలో ప్రతిరోజూ పండగే పరిస్థితి కొంచెం బెటర్ గా ఉంది. ఓ మాదిరి కలెక్షన్స్ తో మొదలైన ప్రతిరోజూ పండగే, పర్వాలేదనిపించేలా ఉంది అనే టాక్ తెచ్చుకోవడంతో డీసెంట్ కలెక్షన్స్ ను సాధిస్తోంది. వెంకీ మామ కూడా యావరేజ్ గానే తన రన్ ను ముగించే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ నెల లాస్ట్ వీకెండ్ కూడా పెద్ద సంఖ్యలో సినిమాలు విడుదల కానున్నాయి.

రాజ్ తరుణ్ దిల్ రాజు నిర్మాణంలో నటించిన ఇద్దరి లోకం ఒకటే, అలాగే కీరవాణి తనయుడు హీరోగా చేసిన మత్తు వదలరా సినిమాలు డిసెంబర్ 25న విడుదల కాబోతున్నాయి. ఈ రెండు చిత్రాలకు కూడా బజ్ తక్కువగానే ఉంది. దిల్ రాజు సినిమా అయినా కూడా ఇద్దరి లోకం ఒకటేకు బజ్ పెద్దగా లేదు. ప్రమోషన్స్ కూడా తక్కువగానే చేస్తున్నారు. మత్తు వదలరా పరిస్థితి ఇంచుమించు ఇంతే. ఇక ఇంతటితో ఆగిపోలేదు. డిసెంబర్ 26న అక్షరం, డిసెంబర్ 27న నవీన్ చంద్ర హీరోగా నటించిన హీరో హీరోయిన్, తమిళ డబ్బింగ్ చిత్రం పిజ్జా 3, గౌతమ్ మీనన్, ధనుష్ సినిమా తూటా విడుదల కాబోతున్నాయి. ఇక డిసెంబర్ 28న సుడిగాలి సుధీర్ హీరోగా తెరకెక్కిన సాఫ్ట్ వేర్ సుధీర్ విడుదల కానుంది.

పేర్లు వింటుంటేనే ఈ చిత్రాలకు ఎటువంటి బజ్ లేదనే సంగతి అర్ధమైపోతుంది. ఈ సినిమాలు అద్భుతాలు చేసేస్తాయని ఎవరూ ఊహించట్లేదు. కాబట్టి 2019 ఎండింగ్ కూడా టాలీవుడ్ కు పెద్దగా కలిసిరావట్లేదనే తెలుస్తోంది. మరి 2020 అయినా తెలుగు సినిమాకు కలిసిరావాలని కోరుకుందాం.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts