Homeటాప్ స్టోరీస్డర్టీ హరి రివ్యూ

డర్టీ హరి రివ్యూ

డర్టీ హరి రివ్యూ
డర్టీ హరి రివ్యూ

న‌టీన‌టులు: శ‌్ర‌వ‌ణ్‌రెడ్డి, రుహానీ శ‌ర్మ, సిమ్ర‌త్‌కౌర్‌, సురేఖా వాణి, అజ‌య్‌, అప్పాజీ అంబ‌రీష్‌, జ‌బ‌ర్ద‌స్త్ మ‌హేష్ త‌దిత‌రులు న‌టించారు.
ద‌ర్శ‌క‌త్వం: ఎం.ఎస్‌.రాజు
నిర్మాత‌లు:  గూడూరు స‌తీష్‌బాబు, గూడూరు సాయి పునీత్‌, హైలైఫ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ కేదార్ సెల‌గం శెట్టి, వంశీ కారుమంచి
సంగీతం:  మార్క్ కె. రాబిన్‌
సినిమాటోగ్ర‌ఫీ: ఎం.ఎన్‌. బాల్‌రెడ్డి
ఏటీటీ రిలీజ్: ఫ‌్రైడే మూవీస్‌
రిలీజ్ డేట్: 18 – 12- 2020
రేటింగ్: 3/5

టాలీవుడ్‌లో ఎం.ఎస్‌. రాజు చిత్రాల‌కు ప్ర‌త్యేక స్థానం వుంది. ఆయ‌న నుంచి సినిమా వ‌స్తోందంటే ప్రేక్ష‌కుల్లో ప్ర‌త్యేక ఆస‌క్తి నెల‌కొంటుంది. ఒక్క‌డు, మ‌న‌సంతా నువ్వే, నువ్వొస్తానంటే నేనొద్దంటానా!, వ‌ర్షం వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌తో ఎం.ఎస్‌. రాజు ప్ర‌త్యేత‌ని చాటుకున్నారు. `వాన‌` చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మారిన ఆయన తాజాగా త‌న పంథాకు పూర్తి భిన్నంగా చేసిన రొమాంటిక్ థ్రిల్ల‌ర్ `డ‌ర్టీహ‌రి`. శ్రవ‌ణ్‌రెడ్డి హీరోగా ప‌రిచ‌యం అయ్యారు. రుహానీ శ‌ర్మ‌, సిమ్రాన్ హీరోయిన్‌లుగా న‌టించారు. టీజ‌ర్‌, ట్రైల‌ర్‌తో సంచ‌ల‌నం సృష్టించిన ఈ మూవీ ఈ శుక్రారం `ఫ్రైడే మూవీస్ ఏటీటీ ద్వారా విడుద‌లైంది. ట్రైల‌ర్‌కి త‌గ్గ‌ట్టే ఈ మూవీ వుందా లేదా అన్న‌ది తెలియాలంటే క‌థ‌లోకి వెళ్లాల్సిందే.

- Advertisement -

క‌థ‌:
హ‌రి (శ్ర‌వ‌ణ్‌రెడ్డి) కోటి ఆశ‌ల‌తో జీవితంలో త‌ను అనుకున్న‌వి సాధించాలని పెద్ద స్థాయిలో వుండాల‌ని హైద‌రాబాద్ చేరుకుంటాడు. అలా న‌గ‌రానికి చేరిన హ‌రి గొప్పింటి అమ్మాయి వ‌సుధ (రుహానీశ‌ర్మ‌) ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఇద్ద‌రూ వివాహం చేసుకోవాల‌నుకుంటారు. ఇదే క్ర‌మంలో వ‌సుధ‌ సోద‌రుడి గ‌ర్ల్‌ఫ్రెండ్ జాస్మిన్‌ని చూసి మోహిస్తాడు. జాస్మిన్ కూడా హ‌రికి ఆక‌ర్షితురాలు కావ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య దూరం త‌గ్గి హ‌ద్దులు దాటేస్తారు. వీరిద్ద‌రి బంధం ఎలాంటి ప‌రిణామాల‌కు దారితీసింది?  వ‌సుధ ని హ‌రి పెళ్లి చేసుకున్నాడా?  జాస్మిన్ క‌థ ఎలాంటి మ‌లుపులు తిరిగింది అన్న‌ది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

న‌టీన‌టుల న‌ట‌న‌:
బాలీవుడ్‌లో వెబ్‌సిరీస్‌లలో న‌టించిన శ్ర‌వ‌ణ్‌రెడ్డికిది తెలుగులో తొలి సినిమా. ప‌క్కా హైద‌రాబాదీ అయిన శ్ర‌వ‌ణ్ ఎలాంటి బెరుకు లేకుండా న‌టించి డ‌ర్టీ హ‌రి పాత్ర‌ని మెప్పించాడు. రియ‌ల్ లైఫ్‌లోనూ ఇలాగే ప్ర‌వ‌ర్తిస్తాడా అనేంత‌గా పాత్ర‌లో లీన‌మై న‌టించిన తీరు ఆక‌ట్టుకుంటుంది. బోల్డ్‌ స‌న్నివేశాల్లోనూ సెటిల్డ్‌గా న‌టించి మెప్పించాడు. డైలాగ్ డెలివ‌రీ, లుక్స్, న‌ట‌న ఈ చిత్రానికి ప్ల‌స్ అయ్యాయ‌ని చెప్పొచ్చు.
ఇక ఇప్ప‌టికే తెలుగులో రెండు చిత్రాల్లో న‌టించి ఆక‌ట్టుకున్న రుహానీ శ‌ర్మ త‌న పాత్ర ప‌రిధి మేర‌కు న‌టించి ఆక‌ట్టుకుంది. ఇందులో ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సిన పాత్ర సిమ్ర‌త్ కౌర్‌ది. ఎం.ఎస్‌. రాజు ని న‌మ్మి ఆయ‌న చెప్పిన పాత్ర‌ని నూటికి నూరు శాతం తెర‌పై ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేసింది. ముఖ్యంగా బోల్డ్ స‌న్నివేశాలతో పాటు మిగ‌తా స‌న్నివేశాల్లోనూ ది బెస్ట్ ఇచ్చేందుకు ప్ర‌య‌త్నించింది. మేజ‌ర్‌గా చెప్పాలంటే సిమ్ర‌త్ కౌర్ పాత్ర ఈ చిత్రానికి ప్ర‌ధాన హైలైట్‌గా సేలింగ్ పాయింట్‌గా నిలిచింద‌ని చెప్పొచ్చు. మిగ‌తా పాత్ర‌ల్లో న‌టించిన సురేఖా వాణి, అజ‌య్‌, అప్పాజీ అంబ‌రీష్‌, జ‌బ‌ర్ద‌స్త్ మ‌హేష్ త‌మ త‌మ పాత్ర‌ల ప‌రిధి మేర న‌టించి మెప్పించారు.

సాంకేతిక నిపుణుల ప‌నితీరు:
నిర్మాత‌గా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ల‌ని అందించి ఆ చిత్రాల‌తో స్టార్స్‌ని ఇండ‌స్ట్రీకి అందించిన‌ ఎం.ఎస్‌. రాజు ద‌ర్శ‌కుడిగా చేసిన మ‌రో బోల్డ్ అటెమ్ట్ `డ‌ర్టీహ‌రి`. బోల్డ్ కంటెంట్‌.. బోల్డ్ సీన్స్  తో నేటి యువ‌త‌ని టార్గెట్ చేస్తూ రూపొందించిన ఈ మూవీ యువ‌త‌ని ఆక‌ట్టుకోవ‌డం ఖాయం. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ నుంచే ఆస‌క్తిని రేకెత్తించిన ఈ మూవీ టీజ‌ర్‌తో టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఎం.ఎస్‌. రాజు ఏంటీ ఇలాంటి అటెమ్ట్ చేయ‌డం ఏంట‌ని అంతా విస్తూ పోయారు. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. మార్క్ కె. రాబిన్ సంగీతం, ఎం.ఎన్‌. బాల్‌రెడ్డి అందించిన విజువ‌ల్స్‌ బాగున్నాయి. ఎం.ఎస్‌. రాజు సినిమా అంటే సాధార‌ణంగా గ్రాండీయ‌ర్ లుక్ వుంటుంది. నిర్మాణ విలువ‌లు కూడా ఉన్న‌తంగా వుంటాయి. అందుకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో `డ‌ర్టీహ‌రి`ని తెర‌కెక్కించారు. ముఖ్యంగా మార్క్ కె. రాబిన్ అందించిన నేప‌థ్య సంగీతం క‌థా గ‌మ‌నానికి ప్ల‌స్‌గా నిలిచింది. జునైద్ ఎడిటింగ్ కూడా బాగా కుదిరింది. అయితే కొన్ని స‌న్నివేశాల్లో మ‌రింత క్రిస్పీగా వుంటే మ‌రింత బాగుండేది.

విశ్లేష‌ణ‌:
నిర్మాత‌గా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ల‌ని అందించి టాలీవుడ్‌లో త‌న ప్ర‌త్యేక‌త‌ని చాటుకున్న ఎం.ఎస్‌. రాజు తొలి సారి బోల్డ్ కంటెంట్‌తో చేసిన మూవీ ఇది. గ్లామర్‌, బోల్డ్ కంటెంట్‌ని ప్ర‌ధానంగా చేసుకుని ఎం.ఎస్‌.రాజు మ‌ర్ద‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌ని చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. క‌థ‌, క‌థ‌నాల్లో మ‌రింత కేర్ తీసుకుని వుంటే ఫ‌లితం మ‌రోలా వుండేది. యూత్‌ని టార్గెట్ చేస్తూ మారుతున్న కాలానికి అనుగునంగా హైలైఫ్ క‌ల్చ‌ర్‌ని తెర‌పై ఆవిష్కరించే ప్ర‌య‌త్నం చేశారు ఎం.ఎస్‌. రాజు. యువ‌త‌ని టార్గెట్ చేస్తూ చేసిన ఈ మూవీ వారిని ఎంట‌ర్‌టైన్ చేస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All