
మొదటి సినిమా హిట్టయితే దర్శకుల కెరీర్ సెట్టయినట్లే అనుకుంటే అది పొరపాటే అవుతుంది. అందుకు పర్ఫెక్ట్ ఉదాహరణ వి యన్ ఆదిత్య. మనసంతా నువ్వే సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆదిత్య ఆ తరువాత ఎన్ని సినిమాలు చేసినా మరో హిట్ అందుకోలేదు. ఆ మధ్య డి. రామానాయుడు సపోర్ట్ తో ముగ్గురు అనే సినిమా చేశాడు.
ఆ సినిమా కూడా దెబ్బకొట్టింది. అనంతరం ఒక సినిమాను స్టార్ట్ చేయగా అది అనుకోని విధంగా మధ్యలోనే ఆగిపోయింది. ఇక ఫైనల్ గా సక్సెస్ అందుకోవాలని ఒక కొత్త కాన్సెప్ట్ తో రాబోతున్నాడు. ఇటీవల ఆ సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేశాడు. ‘వాళ్ళిద్దరి మధ్య’ అనే టైటిల్ సెట్ చేసిన ఆ సినిమా రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరక్కెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమాకు సంబంధించిన టైటిల్ కాన్సెప్ట్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశాడు. పెళ్లి, లవ్ కాన్సెప్ట్ బ్యాక్ డ్రాప్ లో దర్శకుడు కథను సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇన్నిరోజులు విఎన్.ఆదిత్య గీతా ఆర్ట్స్ లో స్క్రిప్టు కన్సల్టెంట్ గానూ, పీపుల్స్ మీడియాలోనూ క్రియేటివ్ హెడ్ గా తన ఆలోచనలు పంచుకున్నారు. ఇక ఫైనల్ గా ఈ సినిమాతో రెగ్యులర్ డైరెక్టర్ గా సెట్టవ్వాలని చూస్తున్నారు. మరి ఈ మనసంతా నువ్వే దర్శకుడు సెకండ్ ఇన్నింగ్స్ లో ఎంతవరకు క్లిక్కవుతాడో చూడాలి.
- Advertisement -