Homeటాప్ స్టోరీస్అంటే యితడు కూడా నయన్ ని పెళ్లిచేసుకోడా

అంటే యితడు కూడా నయన్ ని పెళ్లిచేసుకోడా

Director vignesh shivan sensational comments on nayanataraయువ దర్శకులు విగ్నేష్ శివన్ గతకొంత కాలంగా నయనతారతో సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే . పెళ్లి కాకుండానే ఈ ఇద్దరూ దాదాపు రెండేళ్ల నుండి సహజీవనం చేస్తున్నారు , ఫారిన్ టూర్ లకు వెళ్లినా , మరేదైనా ఫంక్షన్ లకు వెళ్లినా జంటగా వెళ్తున్నారు ఫోటోలకు ఫోజిస్తున్నారు కానీ ప్రేమ , గీమా గురించి మాత్రం అస్సలు మాట్లాడటం లేదు . ఇక తాజాగా దర్శకులు విగ్నేష్ శివన్ సంచలనవ్యాఖ్యలు చేసాడు . నయనతారతో ప్రేమలో ఉన్నారా ? పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అడిగితె ఈ దర్శకుడు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా …… దానికి నాదగ్గర సమాధానం లేదు ఎందుకంటే నయనతార ఈ విషయం చెప్పాలి అలాగే మా అమ్మగారు అనుమతి ఇవ్వాలి అప్పుడే ఏదైనా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు .

అంటే ఇన్నాళ్ళుగా నయనతారతో రొమాన్స్ చేస్తుంటే విగ్నేష్ శివన్ వాళ్ళ అమ్మ అనుమతి అవసరం లేదు కానీ పెళ్ళికి మాత్రం ఆమె అనుమతి కావాలని అంటున్నాడు అలాగే నయనతార కూడా ఈ విషయం మీద చెప్పాలట ! అంటే ఏతా వాటా చెప్పొచ్చేదేంటంటే నయనతారని పెళ్లి చేసుకుంది అనుమానమే ! అని . నయనతార శింబు తో ప్రేమాయణం సాగించింది కానీ శింబు తండ్రి ఒప్పుకోకపోవడం ఒక కారణమైతే శింబు వ్యవహారశైలి వల్ల కూడా ఆ ప్రేమకు బ్రేకప్ అయ్యింది దాని తర్వాత ప్రభుదేవాతో ప్రేమాయణం సాగించింది ఇక పెళ్లి అనుకుంటున్న సమయంలో అది బెడిసికొట్టింది , కట్ చేస్తే విగ్నేష్ శివన్ తోడయ్యాడు మరి ఇప్పుడైనా నయనతారకు పెళ్లి కలిసి వస్తుందా ? లేదంటే షరా మామూలేనా అన్నది చూడాలి .

- Advertisement -

English Title: Director vignesh shivan sensational comments on nayanatara

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All