Homeటాప్ స్టోరీస్తరుణ్ భాస్కర్ కు కోపం వచ్చింది

తరుణ్ భాస్కర్ కు కోపం వచ్చింది

director tarun bhaskar fire on criticsయువ దర్శకులు దాస్యం తరుణ్ భాస్కర్ కు కోపం వచ్చింది అంతే తన సినిమాని తక్కువచేసి మాట్లాడుతున్న ఫిల్మ్ క్రిటిక్స్ ని తిడుతూ సోషల్ మీడియా కి ఎక్కాడు . క్రిటిక్స్ ఇచ్చే రివ్యూలపై నేను కూడా రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను ,ప్రతీ ఒక్కరికి ఒక అభిప్రాయం ఉంటుందని అయితే ఫిల్మ్ కి రివ్యూ ఇచ్చేవాళ్ల లో ఫిలిం అప్రిసియేషన్ కోర్స్ చేసైనా ఉండాలి లేదా స్క్రీన్ ప్లే రాయడంలో , మేకింగ్ విషయాల్లో అనుభవం ఉండాలని కానీ ఇవేవీ లేకుండా రివ్యూ ఇస్తూ తమ కున్న తెలివితేటల్ని ప్రదర్శిస్తున్నారని వాళ్లకు జీరో నాలెడ్జ్ అంటూ నిప్పులు కక్కాడు తరుణ్ భాస్కర్ దాస్యం .

పెళ్లి చూపులు చిత్రంతో ప్రభంజనం సృష్టించిన ఈ దర్శకుడు తాజాగా తన రెండో సినిమాగా ” ఈ నగరానికి ఏమైంది ” చిత్రాన్ని రూపొందించాడు . నలుగురు స్నేహితుల కథతో తెరకెక్కిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వస్తోంది పైగా కొంతమంది సినీ విమర్శకులు తరుణ్ పై విమర్శలు చేయడంతో అది తట్టుకోలేక పోయాడు దాంతో శోషల్ మీడియాలో తన ఆగ్రహాన్ని వెళ్లగక్కాడు తరుణ్ భాస్కర్ .

- Advertisement -

 

ఈ దర్శకుడు చెప్పేదాంట్లో కూడా కొంతవరకు వాస్తవం ఉంది రివ్యూ లు ఎవరిష్టం వచ్చినట్లు ఇస్తున్నారు అయితే దానికి ఫలానా అర్హత ఉండాలనే నియమం అంటూ ఏది లేదు దాంతో ఈ పరిస్థితి . అలాగని తరుణ్ బాగా తీసాడుఆ అని కూడా చెప్పలేం ఎందుకంటే రివ్యూ ల సంగతి పక్కన పెడితే ఈ నగరానికి ఏమైంది చిత్రం చూసిన ప్రేక్షకుల్లో కూడా విభిన్న స్పందన ఉంది . కొంతమంది బాగుందని అంటుంటే మరికొంతమంది యావరేజ్ అని , బాగోలేదని పెదవి విరిచే వాళ్ళు కూడా ఉన్నారు మరి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All