Homeటాప్ స్టోరీస్రంగస్థలం కథ కాపీ లొల్లి

రంగస్థలం కథ కాపీ లొల్లి

director sukumar clarify about copy rangasthalam storyచరణ్ హీరోగా నటించిన రంగస్థలం వేసవిలో ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే . 60 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం 210 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ల ని సాధించి చరణ్ కెరీర్ లోనే నెంబర్ వన్ గా నిలిచింది అంతేకాదు పెర్ఫార్మెన్స్ పరంగా కూడా మైలురాయిగా నిలిచిపోయింది అయితే ఆ సినిమాని విడుదల కంటే ముందు నుండే వివాదాలు చుట్టుముట్టాయి . రంగమ్మ మంగమ్మ అనే పాట పై అప్పట్లో రచ్చ రచ్చ కాగా ఇటీవల రంగస్థలం చిత్ర కథ నాదే అంటూ గాంధీ అనే వ్యక్తి రచయితల సంఘం ని ఆశ్రయించాడు .

గాంధీ కథ కు రంగస్థలం చిత్ర కథ కు పోలిక ఉండటంతో రచయితల సంఘం దర్శకులు సుకుమార్ ని వివరణ కోరింది . సుకుమార్ చెబుతున్న దాని ప్రకారం నేను కానీ నా దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న వాళ్ళు కానీ గాంధీ ని కలవలేదు అతడితో మాకు సంబంధం లేదు . ఇక కథ విషయానికి వస్తే …… అనారోగ్యంతో ఉన్నవాళ్ళ ని ఉరి తీయరని , అలాగే సిడ్ని షెల్డన్ రాసిన ” ఎ స్ట్రేంజర్ ఇన్ ది మిర్రర్ ” కూడా ఇదే లైన్ లో ఉంటుందని ఆ స్ఫూర్తితోనే నేను కథ రాసుకున్నానని అంతేకాని గాంధీ కథ ని కాపీ కొట్టలేదని చెబుతున్నాడు . గాంధీ కాపీ అంటున్నాడు సుకుమార్ కాదంటున్నాడు మరి రచయితల సంఘం ఏం తేల్చుతుందో చూడాలి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All