
రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్ , రామ్ చరణ్ లు హీరోలు గా నటించిన ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) భారీ అంచనాల మధ్య నిన్న శుక్రవారం వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాహుబలి సినిమా తో తెలుగు సినిమా సత్తా చాటిన రాజమౌళి , ఆర్ఆర్ఆర్ తో మరోసారి తెలుగు సినిమా స్థాయి ఏంటో చూపించారు. ఈ మూవీ రిలీజ్ తర్వాత ప్రతి ఒక్కరు రాజమౌళి ప్రతిభ ఫై , ఎన్టీఆర్ , రామ్ చరణ్ నటన ఫై ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఇక చిత్ర సీమలో అయితే ప్రతి ఒక్కరు సినిమా కు జై జై లు కొడుతున్నారు. ఈ క్రమంలో అగ్ర దర్శకుడు శంకర్ సినిమా ఫై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశారు.
‘అసాధారమైన అనుభవాన్ని అందించిన ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్‌కు ధన్యవాదాలు. రామ్ చరణ్ స్క్రీన్ ప్రజెన్స్, హృదయాలను తాకేలా ఎన్టీఆర్ నటించారు. మా అంచనాలను నిలబెట్టిన ‘మహా రాజ’మౌళికి అభినందనలు’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈయన చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. అలాగే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ట్వీట్ చేశాడు. ‘ఆర్ఆర్ఆర్ మూవీ ఘన విజయం సాధించినందుకు చిత్ర యూనిట్‌కు కంగ్రాట్స్. ఎన్టీఆర్, చరణ్ నటన అద్భుతం. రాజమౌళి సార్ ఈ రేంజ్ సినిమాను అందించడం ఆశ్చర్యాన్ని కలిగించలేదు’ అని తెలిపారు.
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు..’రాజమౌళి సృజనాత్మకతకు హద్దు లేదు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటన అసాధారణంగా ఉంది. కీరవాణి బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతం. మొత్తం సినిమా సూపర్’ అని ట్వీట్ చేసారు.