
స్వల్పంగా గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు యువ దర్శకుడు రాజ్ కిరణ్ . అంజలి హీరోయిన్ గా నటించిన సూపర్ హిట్ చిత్రం ” గీతాంజలి ” తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు ఈ రాజ్ కిరణ్ . తాజాగా విశ్వామిత్ర అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు . ఈ సినిమా రేపు విడుదలకు సిద్ధమైంది .
అయితే ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేకుండాపోయాయి దానికి తోడు సరైన థియేటర్ లు కూడా లభించకపోవడంతో పాటుగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో గ్యాప్ లేకుండా పాల్గొంటుండటం వల్ల స్వల్ప గుండెపోటు కి లోనయ్యాడు. డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తూ భయపడాల్సిందేమీ లేదని చెప్పడంతో ఆ చిత్ర బృందం ఊపిరి పీల్చుకుంది . గీతాంజలి చిత్రం తర్వాత త్రిపుర , లక్కున్నోడు చిత్రాలకు దర్శకత్వం వహించాడు . ఇప్పుడు విశ్వామిత్ర తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు .