Homeటాప్ స్టోరీస్`జాంబిరెడ్డి` టైటిల్‌పై ట్రోల్స్‌.. స్పందించిన డైరెక్ట‌ర్‌!

`జాంబిరెడ్డి` టైటిల్‌పై ట్రోల్స్‌.. స్పందించిన డైరెక్ట‌ర్‌!

`జాంబిరెడ్డి` టైటిల్‌పై ట్రోల్స్‌.. స్పందించిన డైరెక్ట‌ర్‌!
`జాంబిరెడ్డి` టైటిల్‌పై ట్రోల్స్‌.. స్పందించిన డైరెక్ట‌ర్‌!

యంగ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ తొలి చిత్రం `అ!`తో జాతీయ స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్నారు. స‌రికొత్త నేప‌థ్యంలో ప్ర‌శాంత్ వ‌ర్మ రూపొందించిన `అ!` విమ‌ర్శ‌కుల‌ని సైతం మెప్పించింది. ఆ త‌రువాత రాజ‌శేఖ‌ర్ హీరోగా చేసిన `క‌ల్కీ` మేకింగ్‌, టేకింగ్ ప‌రంగా మంచి గుర్తింపుని తెచ్చిపెట్టినా ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయింది. ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ వ‌ర్మ `జాంబిరెడ్డి` పేరుతో మూడో చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ప్ర‌పంచాన్ని గ‌త ఐదు నెల‌లుగా గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న వైర‌స్ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. తెలుగులో ఈ జోన‌ర్‌లో రూపొందుతున్న తొలి సినిమా కావ‌డం, వైర‌స్ నేప‌థ్యంలో క‌ర్నూల్ నేప‌థ్యంలో సినిమా చేస్తుండ‌టంతో ఈ చిత్రంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి ఏర్ప‌డింది. అయితే ఇటీవ‌ల టైటిల్ లోగో టీజ‌ర్‌ని రిలీజ్ చేసిన‌ద‌గ్గ‌రి నుంచి ఈ చిత్ర టైటిల్‌పై, ద‌ర్శ‌కుడిపై సెటైర్లు వేస్తున్నారు. అయితే దీనిపై ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ స్పందిస్తూ ఓ వీడియోని విడుల చేశారు.

- Advertisement -

ఇటీవ‌ల మా సినిమా టైటిల్ ని ప్ర‌క‌టించాం. దానికి అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించింది. ట్విట్ట‌ర్‌లో జాతీయ స్థాయిలో ట్రెండింగ్ అయింది. టైటిల్ బాగుందంటూ చాలా కాల్స్‌, మెసేజ్‌లు వ‌చ్చాయి. సినిమాకు అది యాప్ట్ టైటిల్‌. యానిమేష‌న్ చాలా బాగుందంటున్నారు. యానిమేష‌న్ కోసం మూడు నెల‌ల‌కు పైగానే శ్ర‌మించాం. టీమ్ ప‌డిన కష్టానికి ద‌క్కిన ప్ర‌తిఫ‌లంగా భావించాం. కాన కంత మంది మాత్రం త‌ప్పుగా అర్థం చేసుకుంటున్నారు. సినిమాలో ఎవ‌రినీ త‌క్కువ చేసి చూపించ‌డం లేదు. ప్ర‌త్యేకించి ఓ వ‌ర్గాన్ని త‌క్కువ చేసి చూపించ‌డం లేదు. ఇదొక ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఫిల్మ్‌. క‌రోనా మ‌హ‌మ్మారి చుట్టూ క‌ర్నూల్ నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. అక్క‌డి ప్ర‌జ‌లు మ‌హ‌మ్మారిపై పోరాడి ఎలా ప్ర‌పంచాన్ని కాపాడార‌న్న‌దే ఈ చిత్ర క‌థ‌. ద‌య‌చేసి టైటిల్‌ని త‌ప్పుగా అర్థం చేసుకోవ‌ద్దు. ఈ చిత్రానికి అంత‌ర్జాతీయ గుర్తింపు ల‌భిస్తుంద‌ని భావిస్తున్నాను` అన్నారు ప్ర‌శాంత్ వ‌ర్మ‌.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All