- Advertisement -
గీత గోవిందం వంటి సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన తర్వాత కూడా ఖాళీగా ఉన్నాడు దర్శకుడు పరశురామ్ . అగ్ర హీరోలతోనే సినిమా చేయాలనీ ఫిక్స్ అయి కూర్చున్నాడు ఈ దర్శకుడు కానీ పరశురామ్ తో ఇప్పుడే సినిమా చేసే ఆలోచనలో మాత్రం ఏ అగ్ర హీరో లేడు దాంతో పాపం ! ఈ దర్శకుడు పరిస్థితి దారుణంగా ఉంది .
అటు చిన్న హీరోలతో చేయలేక ఇటు పెద్ద హీరోలు డేట్స్ ఇవ్వలేకపోవడంతో రెంటికి చెడిన రేవడిలా తయారయ్యింది పరశురామ్ పరిస్థితి .మహేష్ బాబు తో సినిమా చేయాలనీ అనుకున్నాడు కానీ మహేష్ బాబు మాత్రం ఇంకా ఏమి తేల్చలేదు , అలాగే అల్లు అర్జున్ తో అనుకున్నాడు అది కూడా సెట్ కాలేదు . ఆ ఇద్దరు హీరోలు కూడా బిజీ గా ఉన్నారు . ఇక మిగతా హీరోలు కూడా ఖాళీగా ఏమి లేరు . బ్లాక్ బస్టర్ ఇచ్చి కూడా ఖాళీగా ఉండటం అంటే విచిత్రమే మరి .
- Advertisement -