Homeటాప్ స్టోరీస్విజయ్ దేవరకొండతో లాభపడ్డ డైరెక్టర్

విజయ్ దేవరకొండతో లాభపడ్డ డైరెక్టర్

Director Parashuram gets Huge profit with vijay devarakondaవిజయ్ దేవరకొండతో చేసిన గీత గోవిందం చిత్రంతో భారీగా లాభాలు పొందాడు దర్శకుడు పరశురామ్ . చిన్న చిత్రంగా వచ్చిన గీత గోవిందం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే . వసూళ్ల సునామి సృష్టిస్తూ ఏకంగా 120 కోట్ల గ్రాస్ వసూళ్ళని సాధించింది . 60కోట్ల షేర్ వసూల్ కావడంతో అల్లు అరవింద్ తో పాటుగా ఆ చిత్ర బృందం చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే కేవలం పన్నెండు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన గీత గోవిందం 120 కోట్ల వసూళ్ళ ని అరవై కోట్ల లాభాలను తెచ్చిపెట్టడం అంటే మాటలు కాదు మామూలు విషయం కాదు కదా !

అందుకే వచ్చిన లాభాలలో దర్శకుడికి ముందుగా చెప్పిన మాట ప్రకారం దాదాపు పది కోట్ల ని ఇవ్వడానికి సిద్దం అయ్యాడట అల్లు అరవింద్ , ఇప్పటికే కొంత మొత్తం ఇచ్చాడట ! అలాగే మిగతా సొమ్ము కూడా త్వరలోనే ఇవ్వడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది . విజయ్ దేవరకొండ కున్న క్రేజ్ తో ఈ వసూళ్లు సాధ్యం అయ్యాయి కాబట్టి లాభాల్లో వాటా ఇవ్వాలని పరశురాం కు భారీ మొత్తం ఇస్తున్నాడు . అంటే విజయ్ దేవరకొండ వల్ల పరశురాం భారీగా లాభపడ్డట్లే !

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All