Monday, October 3, 2022
Homeటాప్ స్టోరీస్చెట్లు నాటండి కాలుష్యాన్ని అరికట్టండి అంటున్న దర్శకుడు

చెట్లు నాటండి కాలుష్యాన్ని అరికట్టండి అంటున్న దర్శకుడు

Director of Planting Trees and Preventing Pollution
Director of Planting Trees and Preventing Pollution

నల్లమలలో చేపట్టనున్న యురేనియం తవ్వకాలపై దర్శకుడు శేఖర్‌కమ్ముల ట్వీట్ చేసారు. యురేనియం తవ్వకాల వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందని శేఖర్‌కమ్ముల అన్నారు.
అటవీ ప్రాంతంలో నివసించే ఆదివాసీలకు ఇబ్బందులు ఏర్పడుతాయి. నల్లమల అటవీ ప్రాంతం సమూలంగా నాశనం అవుతుంది. కృష్ణా, దాని ఉపనదులు కలుషితం అవుతాయి. యురేనియం తవ్వకాల వల్ల క్యాన్సర్‌ బాధితుల సంఖ్య పెరుగుతుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి నల్లమల అటవీ ప్రాంతాన్ని పరిరక్షించాలి.. చెట్లు నాటాలి. కాలుష్యాన్ని అరికట్టండి. ‘నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు చేపట్టబోతున్నారు. దీని వల్ల మన పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిళ్లుతుంది. చెంచులు, ఇతర అటవీ వాసులు నివసిస్తున్న ప్రాంతం, అంతరించిపోతున్న పులులు నివసించే ప్రాంతం అయిన నల్లమల సమూలంగా నాశనం అవుతుంది. కృష్ణ, దాని ఉపనదులు కలుషితం అవుతాయి. ఇప్పటికే చాలా మంది క్యాన్సర్‌ బారిన పడ్డారు. యురేనియం తవ్వకాల వల్ల క్యాన్సర్‌ రోగుల సంఖ్య మరింత పెరుగుతుంది. యురేనియం కోసం పర్యావరణాన్ని నాశనం చేసుకోకూడదు. వెంటనే ప్రభుత్వం స్పందించి చెంచులని, ఇతర ఆదివాసులని, పర్యావరణాన్ని మొత్తంగా నల్లమల అడవుల్ని కాపాడాలి’ అని ప్రభుత్వానికి ఇదే నా విన్నపం అని శేఖర్ కమ్ముల ఆవేదనని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసారు.

- Advertisement -

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts