Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ స్క్రీన్ ప్లే మార్చుతున్నాడట

ఎన్టీఆర్ స్క్రీన్ ప్లే మార్చుతున్నాడట

director krish working on ntr biopic screen playఎన్టీఆర్ బయోపిక్ చేయాలనీ బాలయ్య దగ్గరుండి మరీ రాయించుకున్నాడు ఎన్టీఆర్ కథ ని కానీ దర్శకుడు మారడంతో తాజాగా క్రిష్ వచ్చాడు తేజ స్థానంలో దాంతో అంతకుముందు ఉన్న కథ ని మార్చలేం కాబట్టి స్క్రీన్ ప్లే తను ఊహించుకున్నట్లు గా మార్చడానికి బాలయ్య అనుమతి కోరాడట ! తనకు గౌతమీపుత్ర శాతకర్ణి వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు కావడంతో క్రిష్ చేసే మార్పులు నచ్చితే తప్పకుండా చేద్దాం ట్రై చెయ్ అన్నాడట !

ప్రస్తుతం క్రిష్ స్క్రీన్ ప్లే మార్చే పనిలో ఉన్నాడు , ఈనెలాఖరు లోగా స్క్రీన్ ప్లే పరంగా చేసిన మార్పులు బాలయ్య కు వివరించనున్నాడట అవి బాలయ్య కు నచ్చితే వెంటనే అంటే జులై లో ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ కి వెళుతుంది . క్రిష్ చేసిన మార్పులు బాలయ్య కు నచ్చకపోతే పాత స్క్రిప్ట్ ప్రకారం తీయాల్సిందేనట ! ఏమౌతుందో మరి ? ఇక బసవతారకం పాత్రలో బాలీవుడ్ భామ విద్యా బాలన్ నటించనుంది . మిగతా పాత్రల్లో కొత్తవాళ్లు ని తీసుకోవడానికి కాస్టింగ్ కాల్ నిర్వహిస్తున్నారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All