తెలుగునాట విభిన్న కథా చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న క్రిష్ కు ఇన్నేళ్ల కెరీర్ లో వచ్చిన పేరంతా ఈ ఒక్క ఏడాదిలోనే పోయింది, అది కూడా జనవరి నెలలోనే పోవడం మరీ దారుణం . బాలీవుడ్ లో మణికర్ణిక అనే సినిమాకు దర్శకత్వం వహిస్తే అసలు క్రిష్ చేసింది ఏమి లేదు అతడికి డైరెక్షన్ వచ్చా ? అని విమర్శించింది కంగనా రనౌత్ . ఇక తెలుగులో ఎన్టీఆర్ బయోపిక్ అని రెండు భాగాలూ తీస్తే రెండు భాగాలు కూడా ఘోర పరాజయం పాలై క్రిష్ ని మరింతగా క్రుంగ దీసాయి .
అసలే పెళ్లి పెటాకులు అయి ఇబ్బంది పడుతున్న క్రిష్ కు సమ్మెట పోటులా కంగనా సినిమా అలాగే ఎన్టీఆర్ బయోపిక్ లు గట్టి దెబ్బలే కొట్టాయి . కట్ చేస్తే అహం దెబ్బతిన్న క్రిష్ బాలీవుడ్ లో పరువు పోయింది కాబట్టి అక్కడే హిట్ కొట్టాలన్న కసితో ముంబై లో మరో సినిమా కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు . హిందీ సినిమా ఓ కొలిక్కి వచ్చిందట ! దాంతో హిట్ కొట్టి కంగనా కు బుద్ది చెప్పాలని చూస్తున్నాడు క్రిష్ .
English Title: Director Krish planning bollywood movie