Homeటాప్ స్టోరీస్ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కె.వి.ఆనంద్ క‌న్నుమూత‌

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కె.వి.ఆనంద్ క‌న్నుమూత‌

Director K.V. Anand is no more
Director K.V. Anand is no more

త‌మిళ ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖ హాస్య న‌టుడు వివేక్ గుండెపోటుతో మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. వివేక్ ఆక‌స్మిక మృతితో శోక‌సంద్రంలో మునిగిన కోలీవుడ్‌కు మ‌రో చేదువార్త‌. ప్ర‌ముఖ కోలీవుడ్ ద‌ర్శ‌కుడు కె.వి. ఆనంద్ (54) క‌న్నుమూశారు. గుండెపోటుతో ఇటీవ‌ల చెన్నైలోని ఓ ఆసుప‌త్రిలో చేరిన ఆయ‌న శుక్ర‌వారం తెల్ల‌వారు జామున 3 గంట‌ల‌కు తుది శ్వాస విడిచారు. కె.వి. ఆనంద్ ఫేమ‌స్ సినిమాటోగ్రాఫర్ త‌రువాతే ఆయ‌న‌ దర్శకుడిగా మారారు.

సినిమాటోగ్రాఫర్‌గా ఆయన చేసిన కొన్ని ఉత్తమ చిత్రాలు ఓకే ఒకక్కాడు, బాయ్స్, చంద్రలేఖ‌, శివాజీ తో పాటు ఆయన తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ఎన్నో అత్యుత్త‌మ చిత్రాల‌కు పనిచేశారు. దర్శకుడిగా సూర్య హీరోగా న‌టించిన వీడోక్కాడే, జీవాతో `రంగం`, సూర్య‌తో  `బ్రదర్స్`, ధ‌నుష్‌తో  అనేకుడు, సూర్య‌తో `బందోబ‌స్త్‌` చిత్రాలు చేశారు.

- Advertisement -

ఆనంద్ ఆకస్మిక మరణం తెలుసుకుని సౌత్‌లోని సినీ ప్రముఖులు షాక్ అవుతున్నారు. ఆనంద్ సినిమాటోగ్రాఫర్‌గా తెన్నావిన్ కొంబత్‌` అనే మ‌ల‌యాళీ చిత్రంతో కెరీర్ ప్రారంభించారు. తొలి చిత్రానికే జాతీయ స్థాయిలో ఉత్తమ సినిమాటోగ్రాఫ‌ర్‌గా పుర‌స్కారం అందుకున్నారు. అతను ఇండియన్ సొసైటీ ఆఫ్ సినిమాటోగ్రాఫర్స్ (ISC) వ్యవస్థాపక సభ్యుడు కూడా.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All