Homeటాప్ స్టోరీస్చిన్న సినిమాలను చంపేస్తున్నారంటున్న డైరెక్టర్

చిన్న సినిమాలను చంపేస్తున్నారంటున్న డైరెక్టర్

Director Jonnalagadda srinivasarao fires on brockersచిన్న సినిమాలను బ్రోకర్లు చంపేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసాడు సీనియర్ దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు . టాలీవుడ్ లో పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన జొన్నలగడ్డ తాజాగా తన తనయుడు హరికృష్ణ ని హీరోగా పరిచయం చేస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం” ప్రేమెంత పనిచేసే నారాయణ ” . ఈ చిత్రం ఈనెల 22 న విడుదల అవుతున్న నేపథ్యంలో నిన్న హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యు థియేటర్ లో ప్రీ రిలీజ్ వేడుక జరిగింది . ఆ సందర్భంగా తన ఆవేదన వ్యక్తం చేసారు జొన్నలగడ్డ .

 

- Advertisement -

ఈమధ్య కొంతమంది మధ్యవర్తులు తయారై కథ ఏంటి ? అలాగే మిగతా విషయాలు ఏంటి అనే విషయాన్నీ పక్కన పెట్టి నాలుగు ఫైట్లు ఉన్నాయా ? లేకపోతే నాలుగైదు ఫైట్లు పెట్టండి హిందీ కి మంచి రేటు వస్తుంది అని అంటున్నారు . అలాగే రిలీజ్ సమస్యలు కూడా చిన్న సినిమాలను కిల్ చేస్తున్నాయి అంటూ మద్యవర్తులపై ఆగ్రహం వ్యక్తం చేసాడు . నేను ఒక టేక్నిశియన్ ని , మంచి కథ ని నమ్మి ఈ చిత్రం చేశాను , అల్లు అరవింద్ గారి సహకారంతో ఈ సినిమా రిలీజ్ అవుతోంది తప్పకుండా ప్రేక్షకులను అలరించేలా రూపొందిందని అన్నాడు . నిజమే జొన్నలగడ్డ ఆవేశాన్ని , ఆవేదనని అర్ధం చేసుకోవాల్సిందే . సినిమారంగంలో ఈమధ్య విపరీతమైన పోకడలు వచ్చాయి దాంతో మేకర్స్ కి ఇబ్బందిగా తయారయ్యింది .

English Title: Director Jonnalagadda srinivasarao fires on brockers

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All