Homeటాప్ స్టోరీస్సర్దార్ గబ్బర్ సింగ్.. చేయాలనుకున్న సినిమా కాదు

సర్దార్ గబ్బర్ సింగ్.. చేయాలనుకున్న సినిమా కాదు

సర్దార్ గబ్బర్ సింగ్.. చేయాలనుకున్న సినిమా కాదు
సర్దార్ గబ్బర్ సింగ్.. చేయాలనుకున్న సినిమా కాదు

ప్రతి దర్శకుడికి ఒక్కో శైలి ఉంటుంది. దాన్నుండి బయటకు వచ్చి సినిమా తీయడానికి పెద్దగా ఇష్టపడరు. ఒకవేళ అలా చేసినా దాని ఫలితంపై పెద్దగా నమ్మకం పెట్టుకోవడానికి లేదు. దర్శకుడు బాబీ విషయమే తీసుకుంటే, పవర్ సినిమాతో అరంగేట్రం చేసాడు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. రెగ్యులర్ సినిమా అన్న విమర్శలు తెచ్చుకున్నా కూడా పక్కా కమర్షియల్ సినిమాను హ్యాండిల్ చేయగలడన్న నమ్మకాన్ని కలిగించాడు. తన రెండో సినిమా ప్రయత్నాల్లో ఉండగా అనుకోకుండా పవన్ నుండి పిలుపొచ్చింది. సర్దార్ గబ్బర్ సింగ్ చేతిలో పెట్టాడు. ఈ సినిమా అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ కెరీర్ లొనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. మొదటి సినిమాతో హిట్ కొట్టిన బాబీ, చాలా మంది తెలుగు దర్శకుల లాగే రెండో సినిమాతో ప్లాప్ అందుకున్నాడు. అయితే ఈ ప్లాప్ పట్ల తనకేం బాధ లేదని అంటున్నాడు బాబీ. సర్దార్ ప్లాప్ తో తన కెరీర్ వెనక్కి వెళ్ళిపోయిందని తాను అనుకోవట్లేదని, పవన్ కళ్యాణ్ తో పనిచేసిన ప్రతి క్షణాన్ని ఆస్వాదించానని, పవన్ తో జరిగిన రెండేళ్ల ప్రయాణం అద్బుతమని అంటున్నాడు. పవన్ తనకు ఫేవరేట్ నటుడిని, అతని సినిమాలు చూస్తూ సినిమాల మీద ఆసక్తి పెరిగిందని అలాంటిది పవన్ నే డైరెక్ట్ చేసే అవకాశం రావడం, అందులోనూ పవన్ తనను పిలిచి మరీ అవకాశం ఇవ్వడం తనకెప్పటికీ మధురజ్ఞాపకాలని అంటున్నాడు బాబీ.

నిజానికి సర్దార్ గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ ఎంతో ఇష్టపడి ఎంచుకున్న ప్రాజెక్ట్. మూడేళ్లకు పైగా ఈ సినిమాకు స్క్రిప్ట్ రాయడానికి వెచ్చించాడు. సంపత్ నంది తో ఏడాది పాటు ట్రావెల్ కూడా అయ్యాడు. అయితే అతని ట్రీట్మెంట్ నచ్చక సంపత్ ను తప్పించి బాబీను తీసుకున్నాడు. దర్శకుడు మారినా సినిమా ఫలితం మాత్రం మారలేదు.

- Advertisement -

ఈ సినిమా డిజాస్టర్ తర్వాత బాబీ ఎన్టీఆర్ తో జై లవకుశ తీసాడు. అది ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. ఇప్పుడు వెంకటేష్, నాగ చైతన్యలను హీరోగా పెట్టి వెంకీ మామ చిత్రాన్ని తెరకెక్కించాడు. డిసెంబర్ 13న ఈ చిత్రం విడుదలవుతోంది. మరి ఈ సినిమాతో బాబీ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All