పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాత వాసి చిత్రాన్ని నైజాం లో అత్యధిక రేటు కి కొన్నాడు అగ్ర నిర్మాత దిల్ రాజు , 29 కోట్ల కు కొనగా పాపం 9 కోట్లు మాత్రమే వెనక్కి వచ్చాయి అంటే పవన్ సినిమా వల్ల 20 కోట్ల నష్టం దిల్ రాజు కు దాంతో ఒక మాస్టర్ ప్లాన్ ఆలోచించాడు . ఎలాగూ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలనీ దిల్ రాజు ఎప్పటి నుండో అనుకుంటున్నాడు అందుకే పవన్ తో గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన హరీష్ శంకర్ కు కథ రెడీ చేయమని చెప్పాడట ! ఇంకేముంది చెప్పడమే ఆలస్యం ఆ పనిలో పడ్డాడు హరీష్ శంకర్ .
త్రివిక్రమ్ దగ్గరకు వెళ్లి హరీష్ శంకర్ కథ రెడీ చేస్తున్నాడు , పవన్ కళ్యాణ్ ని ఒప్పించి మాకు ఓ సినిమా చేసి పెట్టమని కోరాడట దిల్ రాజు . అజ్ఞాత వాసి డిజాస్టర్ కావడంతో దిల్ రాజు పట్ల కాస్త సాఫ్ట్ కార్నర్ ఉండటంతో తప్పకుండా పవన్ కళ్యాణ్ తో మాట్లాడతాను అని చెప్పాడట త్రివిక్రమ్ . మరి దిల్ రాజు కు పవన్ కళ్యాణ్ సినిమా చేస్తాడా ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న ఎందుకంటే 2019 ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాను ప్రస్తుతం సినిమాలు చేసేది లేదని చెప్పాడు పవన్ కళ్యాణ్ .
- Advertisement -