Homeగాసిప్స్ప్రభాస్ తో దిల్ రాజు.. క్రేజీ కాంబో?

ప్రభాస్ తో దిల్ రాజు.. క్రేజీ కాంబో?

ప్రభాస్ తో దిల్ రాజు.. క్రేజీ కాంబో?
ప్రభాస్ తో దిల్ రాజు.. క్రేజీ కాంబో?

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఊహించని విధంగా సాహో సినిమాతో దెబ్బతిన్న విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఆ సినిమా హిందీలో తప్పితే ఎక్కడ సక్సెస్ కాలేదు. ఇకపోతే ప్రభాస్ మళ్ళీ పాత స్టైల్ లో తెలుగు ఆడియెన్స్ ని ఎలాగైనా మెప్పించాలని రొమాంటిక్ కథలను ఎంచుకుంటున్నాడు. ప్రస్తుతం జాన్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

ప్రభాస్ ఇప్పుడు దిల్ రాజు వలలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరి కాంబినేషన్ లో గతంలోనే మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమా వచ్చిన విషయం తెలిసిందే. బాహుబలి అనంతరం ప్రభాస్ కి చాలా కథలు వినిపించిన దిల్ రాజు అతన్ని మెప్పించలేకపోయాడు. అయితే దిల్ రాజుతో చేయాల్సిన కమిట్మెంట్ ని అయితే ప్రభాస్ మర్చిపోలేదు. జాన్ సినిమా చేస్తూనే ఇచ్చిన మాట ప్రకారం ఆయనతో ఒక సినిమా చేయాలనీ ప్రభాస్ డిసైడ్ అయ్యాడట.

- Advertisement -

ఇక రీసెంట్ గా అందిన సమాచారం ప్రకారం సైరా దర్శకుడిని ప్రభాస్ వైపు లాగి దిల్ రాజు క్రేజీ కాంబినేషన్ ని తెరపైకి తేనున్నట్లు టాక్ వస్తోంది. సురేందర్ రెడ్డి మహేష్ లేదా తారక్ తో చేసే అవకాశం ఉన్నట్లు టాక్ వచ్చింది. దాదాపు మహేష్ తో సెట్టయినట్లే అనే వార్తలు వస్తున్నప్పటికీ ఇప్పుడు దిల్ రాజు మాత్రం సూరిని ప్రభాస్ ని ఒకటి చేస్తున్నట్లు సమాచారం . మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All