
పూజా హగ్దే..ప్రస్తుతం వరుస హిట్స్ తో గోల్డెన్ బ్యూటీ గా మారింది. అమ్మడు ఏ సినిమా చేస్తే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుండడం తో అన్ని భాషల దర్శకులు, నిర్మాతలు , హీరోలు ఈమె కాల్ షీట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. తెలుగు , తమిళ్ ,హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం తమిళ్ హీరో విజయ్ సరసన బీస్ట్ మూవీ లో నటించింది.
పాన్ ఇండియా మూవీ గా బీస్ట్ ఏప్రిల్ 13 న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భాంగా చిత్ర ప్రీ రిలీజ్ వేడుక ను హైదరాబాద్ లో శుక్రవారం గ్రాండ్ గా జరిపారు. ఈ వేడుకలో దిల్ రాజు పూజా ను ఆకాశానికి ఎత్తేసాడు. పూజా.. మన కాజా అంటూ అమ్మడిపై హాట్ కామెంట్స్ చేసాడు. ఆమె లెగ్గు పడితే సూపర్ హిట్టే అని , పూజా పాన్ ఇండియా హీరోయిన్ అని బుట్ట బొమ్మని ఆకాశానికి ఎత్తేశాడు. దిల్ రాజు మాట్లాడుతుంటే అభిమానులు తెగ సంబరపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.