Homeటాప్ స్టోరీస్దిల్ రాజు, యువీ చేతికి మెగా హీరో మూవీ!

దిల్ రాజు, యువీ చేతికి మెగా హీరో మూవీ!

Dil Raju and UV bags Solo Brathuke So better rights
Dil Raju and UV bags Solo Brathuke So better rights

ట్రైల‌ర్‌, టీజ‌ర్ చూడ‌గానే ఈ సినిమా హిట్ అని తెలిసిపోతుంటుంది. అలా తెలిసిన మ‌రుక్ష‌ణ‌మే ఆ సినిమాపై క‌ర్ఛీఫ్ వేసేస్తున్నారు కొంత మంది నిర్మాత‌లు. ముఖ్యంగా దిల్‌రాజు, యువీ క్రియేష‌న్స్ సంస్థ‌లు చిన్న సినిమా, పెద్ద  సినిమా అని కాకుండా హిట్ అవుతుంది అని క‌న్ఫంగా అనిపించిన చిత్రాల్ని రిలీజ్ చేయ‌డానికి ముందుకు వ‌స్తున్నారు.

తాజాగా దిల్ రాజు, యువీ క‌లిసి మెగా హీరో చిత్రాన్ని ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయ‌డానికి ఓవ‌రాల్ డిస్ట్రిబ్యూష‌న్ హ‌క్కుల్ని సొంతం చేసుకున్నారు. ఇంత‌కీ ఆ సినిమా మ‌రేదో కాదు సాయిధ‌ర‌మ్‌తేజ్ హీరోగా న‌టిస్తున్న `సోలో బ్ర‌తుకే సోబెట‌ర్‌`. సుబ్బు ఈ చిత్రం ద్వారా హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. న‌భా న‌టేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌రా సినీ చిత్ర బ్యాన‌ర్‌పై భోగ‌వ‌ల్లి ప్ర‌సాద్‌, భోగ‌వ‌ల్లి బాపినీడు నిర్మిస్తున్నారు.

- Advertisement -

`చిత్ర‌ల‌హ‌రి`తో మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చిన సాయిధ‌ర‌మ్‌తేజ్ తాజాగా `ప్ర‌తిరోజు పండ‌గే` చిత్రంతో మరో విజ‌యాన్ని త‌న ఖ‌తాలో వేసుకున్నారు. ఇటీవ‌ల విడుద‌ల చేసిన `సోలో బ్ర‌తుకే సోబెట‌ర్‌` టీజ‌ర్ అంథెంకు పాజిటీవ్ టాక్ రావ‌డంతో ఈ చిత్రాన్ని ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసే హ‌క్కుల్ని భారీ మొత్తం చెల్లించి దిల్ రాజు, యువీలు సొంతం చేసుకున్నార‌ట‌. ఇప్ప‌టికే క్రేజ్‌ని సొంతం చేసుకున్న ఈ చిత్రాన్ని మే 1న మేడే సంద‌ర్భంగా రిలీజ్ చేస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All